తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fight On A Flight: విమానంలో కొట్టుకున్న ప్యాసెంజర్లు

Fight on a flight: విమానంలో కొట్టుకున్న ప్యాసెంజర్లు

HT Telugu Desk HT Telugu

29 December 2022, 15:34 IST

  • Fight on a flight: విమానంలో ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్న ఘటన థాయిలాండ్ - ఇండియా ఫ్లైట్ లో జరిగింది. దీనిపై భారత దేశ బ్యూరొ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నివేదిక కోరింది.

ఫ్లైట్ లో ప్రయాణీకుల ఘర్షణ దృశ్యం
ఫ్లైట్ లో ప్రయాణీకుల ఘర్షణ దృశ్యం

ఫ్లైట్ లో ప్రయాణీకుల ఘర్షణ దృశ్యం

Fight on a flight: బ్యాంకాక్ నుంచి కోల్ కతా వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణీకుల మధ్య ప్రారంభమైన వాగ్వాదం, ఘర్షణగా మారి, వారిద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Fight on a Thai flight: మాటామాటా పెరిగి..

బ్యాంకాక్ నుంచి కోల్ కతా వస్తున్న ‘థాయి స్మైల్ ఎయిర్ వేస్’(Thai Smile Airways) ఫ్లైట్ లో, ప్రయాణం మధ్యలో ఇద్దరు ప్రయాణీకుల మధ్య ప్రారంభమైన వాగ్వాదం కొట్టుకునే వరకు వెళ్లింది. విమాన సిబ్బంది వారిని ఆపేందుకు విఫల యత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సహ ప్రయాణీకుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఒక వ్యక్తి పదేపదే మరో వ్యక్తిపై చేయి చేసుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. జుట్టు పట్టుకుని ముఖంపై కొడ్తుండడం, ఆ వ్యక్తి ఆ దెబ్బలను అడ్డుకుంటూ, తాను కూడా కొట్టడానికి ప్రయత్నించడం, ఈ గొడవను ఆపేసేందుకు ఫ్లైట్ అటెండెంట్ ప్రయత్నిస్తుండడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆ ఘర్షణకు కారణమేంటో, ఆ ప్రయాణీకుల వివరాలేంటో తెలియరాలేదు.

BCAS asks for a report: నివేదిక కోరిన బీసీఏఎస్

డిసెంబర్ 27న థాయిలాండ్ లోని బ్యాంకాక్ నుంచి కోల్ కతా వస్తున్న థాయి స్మైల్ ఎయిర్ వేస్(Thai Smile Airways) విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రాతిపదికగా తీసుకుని సంబంధిత విమాన యాన సంస్థ నుంచి నివేదిక కోరామని బ్యూరొ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(The Bureau of Civil Aviation Security BCAS)) డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. భారత్ కు సంబంధించి విమాన యాన భద్రతకు ఈ బీసీఏఎస్ (The Bureau of Civil Aviation Security BCAS) బాధ్యత వహిస్తుంది.

Arguement with Flight attendant: ఎయిర్ హోస్టెస్ తో వాగ్వాదం

ఇటీవల ఇస్లాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక ప్రయాణీకుడితో ఎయిర్ హోస్టెస్ వాగ్వాదం ఘటన కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 16 నాటి ఆ ఇండిగో ఫ్లైట్ లో తనను సర్వెంట్ అన్న ప్రయాణీకుడికి ఆ ఎయర్ హోస్టెస్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. తను ఉద్యోగినని సర్వెంట్ ను కాదని, తనతో వేలెత్తి చూపుతూ, గట్టిగా అరుస్తూ మాట్లాడవద్దని ఆమె హెచ్చరించారు. ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది. ఆ ఘటనపై నెటిజన్లు రెండుగా విడిపోయి పెద్ద ఎత్తున వాదన కూడా చేశారు.

టాపిక్