తెలుగు న్యూస్  /  National International  /  Maruti Suzuki To Hike Vehicle Prices This Month

పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఈ నెల నుంచే వర్తింపు..

HT Telugu Desk HT Telugu

06 April 2022, 11:44 IST

  • మారుతీ సుజుకీ సంస్థ తన కార్ల ధరలను పెంచనుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే వర్తింపజేయనున్నట్టు తెలిపింది.

కొత్త బాలెనొ (ఫైల్ ఫోటో)
కొత్త బాలెనొ (ఫైల్ ఫోటో) (AFP)

కొత్త బాలెనొ (ఫైల్ ఫోటో)

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ఉత్పాదక ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ నెలలో తమ అన్ని మోడల్స్‌కు సంబంధించిన కార్ల ధరలను పెంచనున్నట్లు బుధవారం తెలిపింది. 

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

గత సంవత్సరం నుంచి వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితం అవుతూనే ఉందని సంస్థ సెబీకి తెలిపింది. ‘కాబట్టి, అదనపు ఖర్చుల ప్రభావాన్ని ధరల పెంపు ద్వారా వినియోగదారులపై మోపడం కంపెనీకి అత్యవసరంగా మారింది’ అని సంస్థ తెలిపింది.

ఏప్రిల్‌లో ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. పెంపు మోడల్‌ను బట్టి మారుతూ ఉంటుంది. అయితే ప్రతిపాదిత ధరల పెంపు పరిమాణాన్ని కంపెనీ వెల్లడించలేదు. 

ఇన్‌పుట్ ఖర్చులు నిరంతరం పెరగడం వల్ల ఇప్పటికే జనవరి 2021 నుండి మార్చి 2022 వరకు వాహన ధరలను దాదాపు 8.8 శాతం పెంచింది. దేశీయ విపణిలో ఆల్టో నుండి ఎస్-క్రాస్ వరకు అనేక రకాల మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

టాపిక్