తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heartbreak Insurance Fund: విఫల ప్రేమికుల కోసం ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’

heartbreak insurance fund: విఫల ప్రేమికుల కోసం ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’

HT Telugu Desk HT Telugu

17 March 2023, 12:53 IST

  • heartbreak insurance fund: లైఫ్ ఇన్సూరెన్స్ గురించి విన్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి విన్నాం. ప్రాపర్టీ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ల గురించి కూడా విన్నాం. కానీ ఇది సరికొత్త ఇన్సూరెన్స్ ఫండ్. ఇది ఒక ప్రేమ జంట ఆలోచనలో నుంచి వచ్చిన హార్ట్ బ్రేక్ ఇన్సూరన్స్ ఫండ్ (heartbreak insurance fund). 

ప్రతీక్ చేసిన ట్వీట్
ప్రతీక్ చేసిన ట్వీట్

ప్రతీక్ చేసిన ట్వీట్

ప్రతీక్ ఆర్యన్ అనే యువకుడు ఈ ఫండ్ (heartbreak insurance fund) గురించి, దీనితో రూ. 25 వేలు సంపాదించిన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

Heartbreak insurance fund: నెల నెలా రూ. 500..

తను, తన గర్ల్ ఫ్రెండ్ బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశామని, అందులో ప్రతీ నెల ఇద్దరం చెరో రూ. 500 డిపాజిట్ చేసే వాళ్లమని ప్రతీక్ వివరించాడు. దానికి హార్ట్ బ్రేక్ ఇన్యూరెన్స్ ఫండ్ (heartbreak insurance fund) అని పేరు పెట్టారు. అలా రిలేషన్ షిప్ ప్రారంభమైన నాటి నుంచి వారు ప్రతీనెల ఆ అకౌంట్ లో రూ. 500 చొప్పున జమ చేయడం ప్రారంభించారు. ఇద్దరిలో ఎవరు మోసం చేసినా, ఎవరు బ్రేకప్ చెప్పినా.. ఆ జాయింట్ అకౌంట్ లోని మొత్తాన్ని మరొకరు తీసుకోవచ్చన్నది తమ ఒప్పందమని వివరించాడు. ఇటీవల ప్రతీక్ గర్ల్ ఫ్రెండ్ ప్రతీక్ కు బ్రేకప్ చెప్పేసింది. దాంతో ఆ జాయింట్ అకౌంట్ లో అప్పటికి జమ అయి ఉన్న రూ. 25 వేలు ప్రతీక్ తీసేసుకున్నాడు. ‘‘నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడం వల్ల నేను రూ. 25 వేలు సంపాదించాను’’ అని ప్రతీక్ ఆ ట్విటర్ పోస్ట్ లో పేర్కొన్నాడు.

Viral in Social media: సోషల్ మీడియాలో వైరల్..

ప్రతీక్ ట్విటర్ (twitter)లో షేర్ చేసిన ఈ ((heartbreak insurance fund)) పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. ట్విటర్ (twitter) లో ఆ పోస్ట్ 2.98 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఆ పోస్ట్ కు వేలల్లో రీట్వీట్స్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ బిజినెస్ ఐడియా బావుందని, తాను కూడా ట్రై చేస్తానని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇన్వెస్ట్ మెంట్ పెట్టాలని చూస్తున్నా. ఈ ఆప్షన్ చాలా బావుంది. నాతో ఎవరైనా కలుస్తారా?’ అని మరో నెటిజన్ స్పందించారు. ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్, థింక్ బిఫోర్ లీవింగ్ (HIF investments are subject to market risk.. ,think before leave) ’ అంటూ మరో నెటిజన్ సరదాగా రెస్పాండయ్యారు. ‘రూ. 25 వేలు పోయినా సరే.. నీకు దూరం కావాలని ఆ అమ్మాయి నిర్ణయించుకుందంటే, ఈ బిజినెస్ లో నీకు తిరుగులేదు. వేరే వాళ్లతో మళ్లీ ట్రై చేయి. ఇది నీకు మంచి రిటర్న్స్ ఇచ్చే బిజినెస్ అవుతుంది’ అని ఇంకో నెటిజన్ ఉచిత సలహా ఇచ్చాడు.