తెలుగు న్యూస్  /  National International  /  Madhya Pradesh Road Accident 8 Dead Several Injured As Truck Rams Into Two Busses

Madhya Pradesh road accident : రెండు బస్సులను ఢీకొట్టిన ట్రక్కు.. 8మంది బలి

Sharath Chitturi HT Telugu

25 February 2023, 8:25 IST

  • Madhya Pradesh road accident : మధ్యప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8మంది మరణించారు. 50మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం

Madhya Pradesh road accident : మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ.. సిద్ధి ప్రాంతంలో ఓ ట్రక్కు.. మరో రెండు బస్సులను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సుల్లోని ప్రజలు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్​ షా ర్యాలీ నుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

పార్కు చేసి ఉన్న బస్సులను ఢీకొట్టి..

మధ్యప్రదేశ్​ బఘాడా గ్రామానికి సమీపంలో జరిగింది ఈ ఘటన. వేగంగా వెళుతున్న ట్రక్కు టైర్​ ఒక్కసారిగా పేలిపోవడంతో, అదుపు తప్పి రెండు బస్సులను బలంగా ఢీకొట్టిందని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Madhya Pradesh Sidhi road accident : "రెండు బస్సులు పార్కు చేసి ఉన్నాయి. అందులో అనేకమంది ప్రజలు ఉన్నారు. కాగా.. ఓ ట్రక్కు టైర్​ పగిలి ఆ రెండు బస్సులవైపు దూసుకెళ్లింది. వాటిని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో 50మంది గాయపడ్డారు. వీరిలో 15-20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టాము. మరింత సమాచారం తెలియాల్సి ఉంది," అని రేవా ఎస్​పీ ముఖేశ్​ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు.

Sidhi road accident death toll : ఘటనపై మధ్యప్రదేశ్​ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు, స్వల్పంగా గాయపడిన వారిక రూ. 1లక్ష పరిహారాన్ని ప్రకటించారు.

ప్రమాదంపై అమిత్​ షా స్పందించారు.

MP road accident latest news : "సిద్ధిలో జరిగిన రోడు ప్రమాదం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలని నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలంలో దేవుడు వారికి అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారు వేగంగా కోలుకోవాలి," అని ట్వీట్​ చేశారు అమిత్​ షా.