Kotamreddy Complaint : అమిత్‌ షాకు ఫిర్యాదు చేసిన కొోటంరెడ్డి….-kotamreddy sridhar complaints to union home minister amit sha on phone tapping issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Kotamreddy Sridhar Complaints To Union Home Minister Amit Sha On Phone Tapping Issue

Kotamreddy Complaint : అమిత్‌ షాకు ఫిర్యాదు చేసిన కొోటంరెడ్డి….

HT Telugu Desk HT Telugu
Feb 08, 2023 11:39 AM IST

Kotamreddy Complaint ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Complaint ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ పునరుద్ఘాటించారు. గత వారం పది రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కోటంరెడ్డి ఫోన్ సంభాషణల లీక్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని చెప్పిన కోటంరెడ్డి, నేరుగా వెళ్లి వారిని కలిసి లేఖ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, ఆడియోలు మాత్రమే లీక్ అయ్యాయని అధికార పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో తన ఫోన్ సంభాషణలు బయటకు రావడం వెనుక ట్యాపింగ్ జరిగిందని కోటం రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కోటంరెడ్డి ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయట్లేదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుండటంతో కోటంరెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తే తనపై విమర్శలు చేస్తున్నారని, నేను ఆరోపణలు చేస్తే వారు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలని, తనపై శాపనార్ధాలు, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ లో రహదారులు, వాటర్ వర్స్క్ పై మాట్లాడితే తప్పేమిటని, కాంట్రాక్టర్ పనులు ఆపేస్తే ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చిందని కోటంరెడ్డి చెప్పారు.

నియోజక వర్గంలో రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని, ధ్వంసమైన రహదారులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సగంలో పనులు ఆగాయని, కేవలం రూ.10 కోట్లు విడుదల చేస్తే సరిపోతుందని, ప్రభుత్వం నిధులు విడుదల చేసి కాంట్రాక్టర్ కు సూచిస్తే బాగుంటుందని చెబుతున్నారు. రహదారులు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు వాటిపై దృష్టి పెట్టాలని సూచిస్తు్నారు. పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద రహదారి సమస్యను సీఎంకు నేరుగా చూపించానని ఒక్క సమస్యను కూడా పరిష్కరించ లేదని ఆరోపిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్