Accident in Manyam: మన్యంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
Parvathipuram Manyam District News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
Road accident at Chollapadam village: ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. కొమరాడ వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో లక్ష్మీ, నరసమ్మ, మెల్లిక శారదతో పాటు మరో ముగ్గురు చనిపోయారు. కొందరు స్పాట్ లోనే చనిపోగా... మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో సహా 13మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులంతా అంటివలస గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సు బోల్తా...
విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై చిల్లకల్లు టోల్‌గేట్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు బోల్తా పడింది. అదుపుతప్పటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పడు బస్సులో 27 మంది ఉండగా... వారిలో 11 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.