తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today: కర్నాటక సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్, పట్టువీడని డీకే!
సిద్ధరామయ్య
సిద్ధరామయ్య (PTI)

Live News Today: కర్నాటక సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్, పట్టువీడని డీకే!

17 May 2023, 21:39 IST

  • Live News - Latest Updates Today: నేటి జాతీయ, అంతర్జాతీయ, వ్యాపార, ఆటో, టెక్ వార్తల తాజా సమాచారం కోసం ఈ లైవ్ పేజీని ఎప్పటికప్పుడు చూడండి. లేటెస్ట్ అప్‍డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవుతూనే ఉండండి. 

17 May 2023, 21:39 IST

కర్నాటక సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్, పట్టువీడని డీకే!

కర్నాటక కాంగ్రెస్ (Karnataka Congress) లో ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పదవికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం చూపుతున్న వేర్వేరు ప్రత్యామ్నాయాలను సీఎం రేసులో ఉన్న సిద్ధ రామయ్య, శివకుమార్ లు అంగీకరించడం లేదు.తొలి రెండేళ్లు ఒకరు, తరువాతి మూడేళ్లు మరొకరు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదనకు కొంతవరకు అంగీకారం తెలిపిన శివకుమార్.. మొదట సీఎంగా తనకే అవకాశం ఇవ్వాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాల పరిమితితో మొదట సీఎం కావడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, అందుకు సిద్ధరామయ్య అభ్యంతరం తెలిపారని, మొదటి రెండేళ్లు తానే సీఎంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారని సమాచారం.

17 May 2023, 19:13 IST

Cabinet decisions: ఎరువుల సబ్సీడీ రేట్లపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ఎరువులకు వాటి పోషకాధార సబ్సీడీ (nutrient-based subsidy NBS) ధరలను సవరించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కొత్త సబ్సీడీ రేట్లు పాస్ఫరస్, పొటాషియం (phosphatic and potassic P&K) ఎరువులకు రబీ సీజన్ తో పాటు ఖరీఫ్ సీజన్ కు వర్తిస్తాయి. రైతులకు నాణ్యమైన ఎరువులను సబ్సీడీ ధరలకే అందజేసే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

17 May 2023, 17:28 IST

‘‘రొటేషనల్ సీఎంకు ఓకే.. కానీ, ఫస్ట్ నాకే ఇవ్వాలి’’

కర్నాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి రెండేళ్లు ఒకరు, తరువాతి మూడేళ్లు మరొకరు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదనకు కొంతవరకు అంగీకారం తెలిపిన శివకుమార్.. మొదట సీఎంగా తనకే అవకాశం ఇవ్వాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాల పరిమితితో మొదట సీఎం కావడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, అందుకు సిద్ధరామయ్య అభ్యంతరం తెలిపారని, మొదటి రెండేళ్లు తానే సీఎంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారని సమాచారం.

17 May 2023, 17:24 IST

సీఎం పదవి కాకుండా ఏమిచ్చినా తీసుకోను: డీకే శివకుమార్

కాంగ్రెస్ పార్టీలో కర్నాటక సీఎం ఎంపిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ లు పట్టు వీడడం లేదు. సిద్ధ రామయ్యకు సీఎం పదవి, శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు ఇస్తామన్న ప్రతిపాదనను డీకే తిరస్కరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి మినహా ఏమిచ్చినా తనకు వద్దని డీకే శివకుమార్ స్పష్టం చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

17 May 2023, 17:22 IST

‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. రూమర్లు నమ్మొద్దు’ - కాంగ్రెస్

కర్నాటక సీఎంగా సీనియర్ నేత సిద్ధ రామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందన్న వార్తలు నిజం కాదని, కర్నాటక సీఎం గా ఎవరు ఉండాలన్న విషయమై ఇప్పటివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

17 May 2023, 15:02 IST

శివకుమార్ కు డెప్యూటీ సీఎం, ఆరు పోర్ట్ ఫోలియోలు!

కర్నాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య ను ఖాయం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం పీఠం ఆశించిన మరో సీనియర్ నేత, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, ఆరు మంత్రిత్వ శాఖలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆఫర్ పై శివకుమార్ ఇంకా స్పందించలేదు.

17 May 2023, 14:23 IST

‘Pilot vs Gehlot’ in Rajasthan: రాజస్తాన్ కాంగ్రెస్ లో ముదురుతున్న సంక్షోభం

రాజస్తాన్ (Rajasthan) లో వసుంధర రాజే సీఎంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అవినీతి పై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్న ప్రధాన డిమాండ్ తో సచిన్ పైలట్ (Sachin Pilot) గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాజస్తాన్ పబ్లిక సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలని, పేపర్ లీక్ వల్ల నష్టపోయిన అభ్యర్థులకు పరిహారం చెల్లించాలని పైలట్ (Sachin Pilot) డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై తమ ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసనగా ఇటీవల ఆయన ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఆ తరువాత, ఐదురోజుల పాటు అజ్మీర్ నుంచి జైపూర్ వరకు జన సంఘర్ష్ యాత్ర చేశారు. ఆ యాత్ర సోమవారం ముగిసింది. ఇప్పటికీ తన డిమాండ్ల విషయంలో స్పందించనట్లైతే, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను ప్రారంభిస్తానని (Sachin Pilot) హెచ్చరించారు. పైలట్ తీరు సీఎం గహ్లోత్ తో పాటు పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది.

17 May 2023, 14:01 IST

10 జన్‍పథ్ నుంచి బయలుదేరిన డీకే శివకుమార్

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన తర్వాత కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ 10 జన్‍పథ్ నుంచి బయలుదేరారు. కర్ణాటక సీఎం పదవి కోసం సిద్ధరామయ్యతో డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. అయితే అధిష్టానం సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. సిద్ధరామయ్య రేపు బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం సహా కీలకమైన మంత్రిత్వ శాఖకు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై డీకే శివకుమార్ స్పందించాల్సి ఉంది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ నేటి సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

17 May 2023, 13:35 IST

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం రేపే! 

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. బెంగళూరులో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఇప్పటికే పనులు మొదలయ్యాయి.  కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2013-2018 మధ్య ఆయన సీఎంగా పని చేశారు.  

17 May 2023, 13:15 IST

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య!

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. డీకే శివకుమార్‌కు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెక్ కర్ణాటక అధ్యక్షుడిగా శివకుమార్‌ను కొనసాగించాలని అధిష్టానం భావిస్తోంది. 

17 May 2023, 13:02 IST

Adani - Hindenburg Row: సెబీకి మూడు నెలల గడువు ఇచ్చిన సుప్రీం

అదానీ గ్రూప్‍‍పై వెల్లడైన హిండెన్‍బర్గ్ రిపోర్టుపై విచారణ జరిపేందుకు సెబీ (SEBI)కి మరో మూడు నెలల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆగస్టు 14వ తేదీ వరకు గడువును పొడిగించింది. 

17 May 2023, 12:33 IST

రాహుల్ నివాసానికి డీకే శివకుమార్

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ నివాసమైన 10 జన్‍పథ్‍కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేరుకున్నారు. రాహుల్ గాంధీని ఆయన కలవనున్నారు. కాసేపటి క్రితమే సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా అక్కడికి వచ్చారు. కర్ణాటక సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. 

17 May 2023, 12:13 IST

మణిపూర్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

రాష్ట్రంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి తాజా పరిస్థితులపై రిపోర్టును ఇవ్వాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై మొదటి వారంలో చేపడామని వెల్లడించింది. 

17 May 2023, 11:52 IST

10 జన్‍పథ్ చేరుకున్న సిద్ధరామయ్య

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీని కలిసేందుకు 10 జన్‍పథ్‍ (టెన్ జన్‍పథ్)కు కర్ణాటక సీనియర్ లీడర్ సిద్ధరామయ్య చేరుకున్నారు. కర్ణాటక సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. నేడు కర్ణాటక సీఎం అంశంపై కాంగ్రెస్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

17 May 2023, 11:25 IST

గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రత

మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. వై కేటగిరీ గడువు ముగియటంతో ఆయనకు భద్రతను అప్‍గ్రేడ్ చేసేందుకు ఆ ప్రభుత్వం నిర్ణయించింది. 

17 May 2023, 10:43 IST

రాహుల్‍ను కలవనున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ లీడర్లు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ తీవ్రమైంది. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో నేడు కలవనున్నారు సిద్ధరామయ్య, శివకుమార్. కర్ణాటక సీఎం ఎవరనేది నేడు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. 

17 May 2023, 10:27 IST

బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ లాంచ్

బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఇంట్రడక్టరీ ధరతో సేల్‍కు కూడా వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

17 May 2023, 10:08 IST

క్వాడ్ మీటింగ్ రద్దు

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే వారంలో జరగాల్సిన క్వాడ్ మీటింగ్ రద్దయింది. ఈ సదస్సుకు రాలేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడంతో దీన్ని రద్దు చేసింది ఆస్ట్రేలియా. ఈ క్వాడ్ సమ్మిట్‍లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ దేశాల అధినేతలు పాల్గొనాల్సి ఉంది. 

17 May 2023, 9:41 IST

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రం మెదినీపూర్ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. 

17 May 2023, 9:24 IST

ఫ్లాట్‍గా ఓపెన్ అయిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‍గా ఓపెన్ అయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 5.65 పాయింట్లు నష్టపోయి 18,280.85 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 6.68 పాయింట్లు తగ్గి 61,925.79 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

17 May 2023, 8:57 IST

100 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 100 ప్రాంతాల్లో ఎన్ఐఏ బుధవారం సోదాలు చేస్తోంది. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, గ్యాంగ్‍స్టర్స్ సంబంధిత కేసుల్లో భాగంగా ఈ సోదాలు చేస్తోంది. 

17 May 2023, 8:29 IST

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యే ఛాన్స్

భారత స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‍గా లేకపోతే స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో ఉంది. 

17 May 2023, 8:28 IST

ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్న బైడెన్

క్వాడ్ మీటింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాల్సిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్‍లో జీ7 సదస్సులో పాల్గొన్న తర్వాత నేరుగా ఆయన అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో అప్పుల కష్టాలు తారస్థాయికి చేరటంతో.. ఆ పరిస్థితులను సమీక్షించేందుకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

17 May 2023, 8:27 IST

కర్ణాటక సీఎం పదవిపై టెన్షన్.. నేడు ప్రకటన వచ్చే ఛాన్స్

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికవుతారన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవికి పోటీ పడుతున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇప్పటికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కాగా, కర్ణాటక సీఎంను కాంగ్రెస్ అధిష్టానం నేడు ప్రకటిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈనెల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 

17 May 2023, 8:57 IST

పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 పెరిగి రూ.56,750కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.110 పెరిగి రూ.61,910కు చేరింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఆర్టికల్ షేర్ చేయండి