boAt New Smartwatch: బోట్ నుంచి మరో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఇంట్రడక్టరీ ధరతో సేల్‍కు..
boAt Storm Connect Plus: బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. ఇంట్రడక్టరీ ధరతో సేల్‍కు వచ్చింది.
boAt Storm Connect Plus Smartwatch: దేశీయ కంపెనీ బోట్ (boAt) మరో స్మార్ట్‌వాచ్‍ను బడ్జెట్ రేంజ్‍లో విడుదల చేసింది. బోట్ స్ట్రామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉండే డిస్‍ప్లే ఈ వాచ్‍కు ఉంది. ఈఎన్ఎక్స్ అల్గారిథమ్‍తో బ్లూటుత్ కాలింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఇక విభిన్న హెల్త్ ఫీచర్లు, స్పోర్డ్స్ మోడ్‍లను ఈ వాచ్ కలిగి ఉంది. బోట్ స్ట్రామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.
బోట్ స్ట్రామ్ కనెక్ట్ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
boAt Storm Connect Plus: 1.91 ఇంచుల హెచ్‍డీ స్క్వేర్ షేప్ డిస్‍ప్లేను ఈ బోట్ స్ట్రామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 550 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్, 2.5D కర్వ్డ్ గ్లాస్ ఈ డిస్‍ప్లేకు ఉంటాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‍తో ఈ వాచ్ వచ్చింది. బోట్‍కు చెందిన ENx అల్గారిథమ్‍తో కూడిన బ్లూటూత్ కాలింగ్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని ఈ స్మార్ట్‌వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‍గ్రౌండ్ నాయిస్‍ను ENx తగ్గిస్తుందని బోట్ పేర్కొంది.
boAt Storm Connect Plus: హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ హెల్త్ ఫీచర్లతో బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. 100కుపై స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. 100కుపైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఇక ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ ప్లే బ్యాక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను వాచ్‍లోనే పొందవచ్చు.
boAt Storm Connect Plus: బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్‍లో 300mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సాధారణ యూజ్ కోసం 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.
బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్
boAt Storm Connect Plus: బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ ధర ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో రూ.1,799గా ఉంది. కాగా, దీన్ని ఇంట్రడక్టరీ ఆఫర్ ధరగా బోట్ పేర్కొంది. అంటే, కొంతకాలమే ఈ ధర ఉండే ఛాన్స్ ఉంది. మరోవైపు బోట్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ ధర రూ.1,999గా ఉంది. యాక్టివ్ బ్లాక్, యాక్టివ్ బ్లూ, కూల్ గ్రే, మరూన్ కలర్ ఆప్షన్‍లలో బోట్ స్టామ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్‌వాచ్ లభిస్తోంది.
సంబంధిత కథనం