తెలుగు న్యూస్  /  National International  /  Live News Today 9th June 2023 National International Business Sports News Updates
లైవ్​ న్యూస్​ టుడే..
లైవ్​ న్యూస్​ టుడే.. (AP)

Live news today : రుతుపవనాల రాకతో కేరళలో భారీ వర్షాలు..

09 June 2023, 21:12 IST

  • Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్​ వార్తల లైవ్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి..

09 June 2023, 21:12 IST

ఒడిశాలో రైలు ప్రమాద మృత దేహాలను తాత్కాలికంగా భద్రపర్చిన స్కూలు భవనం కూల్చివేత

వేసవి సెలవుల కారణంగా ఖాళీగా ఉండడంతో బహనాగ ఉన్నత పాఠశాల భవనంలో రైలు ప్రమాదంలో మరణించిన వారి శవాలను భద్రపర్చారు. అయితే, వేసవి సెలవులు ముగిసి, సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. దాంతో, గతంలో కుప్పలు కుప్పలుగా మృతదేహాలను ఉంచిన ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలోకి వెళ్లడానికి విద్యార్థులు భయపడ్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆ భవనంలోకి పంపించడానికి వెనుకాడుతున్నారు. ఉపాధ్యాయులు సైతం ఆ భవనంలో విధులు నిర్వర్తించడానికి వెనుకాడుతున్నారు. పాఠశాల భవనంలో నుంచి ఇప్పటికీ ఒక రకమైన దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఈ భవనంలోనే వందల శవాలను ఉంచారన్న విషయాన్ని మర్చిపోవడం చాలా కష్టమని, దానివల్ల తమలో భయం వేస్తుందని ఒక విద్యార్థి తెలిపాడు

09 June 2023, 20:07 IST

యూపీలో దళిత బాలికపై హత్యాచారం; నిందితుడు కూడా మైనరే..

లక్నోలోని ఇందిరానగర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు పనికి పోవడంతో బాధితురాలైన బాలిక, ఆమె ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చొరబడిన 16 ఏళ్ల బాలుడు ఆ బాలిక ఇద్దరు చెల్లెళ్లను వేరే గదిలో బంధించి, ఆ బాలికపై పై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమె తలపై రాయితో మోది హత్య చేశాడు. ఆ తరువాత, ఆ ఘటనను ఆత్మహత్యగా చూపడానికి, ఆ బాలిక మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. అనంతరం ఆ ఇంటి నుంచి పారిపోయాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లి తన ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఆ బాలుడిని చూసింది.

09 June 2023, 19:34 IST

ముంబై హత్య కేసులో వెలుగుచూస్తున్న విస్తుపోయే వాస్తవాలు

దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ముంబై హత్య ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మనోజ్ సహాని అనే 56 ఏళ్ల వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న సరస్వతి వైద్య అనే మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి, వాటిని ఉడకించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

09 June 2023, 16:56 IST

లీటరుకు 34 కిమీల మైలేజీ, లేటెస్ట్ ఫీచర్స్.. ఆల్ న్యూ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1..

ఈ మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 (Maruti Suzuki Alto Tour H1) ఎక్స్ షో రూమ్ ధర రూ. 4,80,500 లతో ప్రారంభమవుతుంది. ఇది 1 లీటర్ ఇంజిన్, 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మోడల్ ధర. ఇందులో సీఎన్జీ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 5,70,500. ఈ కారు మొత్తం 3 రంగుల్లో లభిస్తుంది. అవి మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, ఆర్క్టిక్ వైట్. మారుతి సుజుకీలో టూర్ ఎడిషన్స్ సెడాన్, హ్యాచ్ బ్యాక్, ఎంయూవీ సెగ్మెంట్లలో ఉన్నాయి.

09 June 2023, 16:02 IST

బేలెనో, సియాజ్.. తదితర మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్

నెక్సా (Nexa) రేంజ్ కార్లపై ఈ జూన్ నెలలో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను మారుతి సుజుకీ (Maruti Suzuki) ప్రకటించింది. గరిష్టంగా రూ. 64 వేల వరకు ఈ కార్లపై కస్టమర్లు డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ ఆఫర్స్ లో ఎక్స్చేంజ్ బోనస్, క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. బేలనో, సియాజ్, ఇగ్నిస్ కార్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

09 June 2023, 16:01 IST

లేటెస్ట్ ఫీచర్స్ తో, అందుబాటు ధరలో సరికొత్త హీరో ప్యాషన్ ప్లస్

సక్సెస్ ఫుల్ మోడల్ ప్యాషన్ ప్లస్ (Passion Plus) కు లేటెస్ట్ ఫీచర్స్ ను జత చేసి సరికొత్తగా హీరో (Hero) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. పెద్దగా హంగామా లేకుండా, సైలెంట్ గా భారతీయ మార్కెట్లో ఈ బైక్ ను లాంచ్ చేశారు. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ 76,301. ధర పరంగా ఈ బైక్ స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ ల మధ్య ఉంటుంది. భారతీయ మధ్య తరగతికి హీరో ప్యాషన్ ప్లస్ (Hero Passion Plus) చాలా విశ్వసనీయమైన, ఇష్టమైన బైక్. ఈ సెగ్మెంట్లో బజాజ్ ప్లాటినా, హోండా షైన్ మోడల్స్ తో ప్యాషన్ ప్లస్ పోటీ పడుతోంది.

09 June 2023, 14:51 IST

క్విడ్, కైగర్, ట్రైబర్ .. తదితర రెనో కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

కైగర్ (Kiger), క్విడ్ (Kwid), ట్రైబర్ (Triber) తదితర కార్లపై ఈ జూన్ నెలలో రెనో ఇండియా (Renault India) డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. వాటిలో క్యాష్ డిస్కౌంట్స్, కార్పొరేట్ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బోనస్ మొదలైనవి ఉన్నాయి. లాయల్టీ బోనస్ పొందడానకి కస్టమర్లు గతంలో రెనో కారును కొనుగోలు చేసి ఉండాలి. జూన్ 30వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.

09 June 2023, 13:34 IST

యువగళం పాదయాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాజంపేట నియోజకవర్గంలో హోరెత్తింధి. 120వరోజు యువగళం పాదయాత్ర కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రారంభమైన చలమారెడ్డిపల్లి మీదుగా టక్కోలు వద్ద రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

09 June 2023, 12:55 IST

శరద్​ పవార్​కు బెదిరింపులు..

ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్​కు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.  చంపేస్తామని పవార్​ను వాట్సాప్​లో బెదిరించినట్టు.. ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.

మరోవైపు ఉద్ధవ్​ ఠాక్రే శివసేన వర్గానికి చెందిన ఎంపీ సంజయ్​ రౌత్​కి కూడా బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.

09 June 2023, 12:06 IST

బీఎండబ్ల్యూ ఎం2 కూపే..

ఎం2 కూపేను ఇండియాలో లాంచ్​ చేసింది బీఎండబ్ల్యూ. దీని ఎక్స్​షోరూం ధర రూ. 98లక్షలుగా ఉంది. ఇందులో 3.0 లీటర్​ ఇన్​లైన్​ 6 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది.

09 June 2023, 11:54 IST

మళ్లీ తెరపైకి మీటూ కేసు

అప్పట్లో మీటూ ఉద్యమం సాగుతున్న సమయంలో నటుడు అర్జున్ మీద నటి శృతి హరిహరన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తనను లైంగికంగా వేధించాడని చెప్పింది. అయితే తాజాగా మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

09 June 2023, 11:09 IST

అసోంలో భూకంపం..

అసోంలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్రత 3.7గా నమోదైంది.

09 June 2023, 10:52 IST

బ్రహ్మానందం ఆస్తి ఎంతో తెలుసా?

బ్రహ్మానందం ఆస్తి ఎంతో తెలుసా? బ్రహ్మానందం మొత్తం ఆస్తులు 490 కోట్ల రూపాయలు ఉందని టాక్. బాగా బిజీగా ఉన్న సమయంలో ప్రతి నెలా 2 కోట్ల రూపాయల వరకూ అందుకునేవాడు. కపిల్ శర్మ కంటే బ్రహ్మానందం ఎక్కువ పారితోషికం తీసుకుంటాడు. బ్రాండ్‌లను ప్రమోట్ చేసినందుకు అతనికి కోటి రూపాయలు అందుతాయి.

09 June 2023, 10:29 IST

సిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు విడుదల

ఆంధ‌్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వారికి త్వరలో అడ్మిషన్లు చేపట్టనున్నారు.

09 June 2023, 10:14 IST

బిపజ్​రాయ్​ తుపాను..

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపజ్​రాయ్​ తుపాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రమవుతుందని ఐఎండీ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో ఈ తుపాను ఉత్త-వాయువ్యంవైపు ప్రయాణిస్తుందని స్పష్టం చేసింది. గత రాత్రి 12 గంటల ప్రాంతంలో తుపాను.. పశ్చిమ- నైరుతి గోవాకు 840కి.మీలు.. పశ్చిమ- నైరుతి ముంబైకు 870కి.మీల దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది.

09 June 2023, 9:37 IST

లాభాలు.. నష్టాలు..

టైటాన్​, టాటా మోటార్స్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

కొటాక్​ బ్యాంక్​, సన్​ఫార్మా, ఇన్ఫీ, హెచ్​యూఎల్​, విప్రో, ఏషియన్​ పెయింట్స్​, టెక్​ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09 June 2023, 9:20 IST

ఇండియా స్టాక్​ మార్కెట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 117 పాయింట్ల లాభంతో 62,966 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 31 పాయింట్లు పెరిగి 18,666 వద్ద ట్రేడ్​ అవుతోంది.

09 June 2023, 8:57 IST

ఒడిశా రైలుకు మంటలు..

దుర్గ్​-పూరి ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని మౌపాదా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీ కోచ్​కు మంటలు అంటుకోగా.. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు మంటలను వెంటనే అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలవ్వలేదు.

09 June 2023, 8:37 IST

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 212.4 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 405.01కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

09 June 2023, 8:21 IST

కేరళలో వర్షాలు..

ఓవైపు తుపాను ప్రభావం, మరోవైపు నైరుతి రుతుపవనాల కారణంగా కేరళవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

09 June 2023, 8:12 IST

అమెరికా స్టాక్​ మార్కెట్​లు

అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం సెషన్​లో స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 0.5శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.62శాతం, నాస్​డాక్​ 1.02శాతం మేర లాభపడ్డాయి.

09 June 2023, 7:59 IST

ట్రంప్​పై అభియోగాలు..

'పోర్న్​ స్టార్​' కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో షాక్​ తగిలింది. రహస్య పత్రాల కేసులో తనపై అభియోగాలు మోపినట్టు స్వయంగా ట్రంప్​ వెల్లడించారు

09 June 2023, 7:59 IST

మారుతీ సుజుకీ ఎంగేజ్​..

జిమ్నీని ఇటీవలే లాంచ్​ చేసిన దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ.. మరో మోడల్​ను భారతీయులకు పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. టయోటా ఇన్నోవా ఆధారంగా రూపొందిస్తున్న 'ఎంగేజ్​' ఎంపీవీని జులై 5న ఆవిష్కరించనుంది.

09 June 2023, 7:59 IST

పసిడి.. వెండి ధరలు..

దేశంలో బంగారం ధరలు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 దిగొచ్చి.. రూ. 55,200కి చేరింది. దేశంలో వెండి ధరలు సైతం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,340గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 73,400కి చేరింది.

09 June 2023, 7:59 IST

స్టాక్​ మార్కెట్​లకు పాజిటివ్​ ఓపెనింగ్​..!

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

    ఆర్టికల్ షేర్ చేయండి