Maruti Engage : మారుతీ సుజుకీ ‘ఎంగేజ్’ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఇదే!
Maruti Engage launch date : మారుతీ సుజుకీ ఎంగేజ్ను జులై 5న ఆవిష్కరించనుంది సంస్థ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Maruti Engage launch date : జిమ్నీని ఇటీవలే లాంచ్ చేసిన దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ.. మరో మోడల్‌ను భారతీయులకు పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. టయోటా ఇన్నోవా ఆధారంగా రూపొందిస్తున్న 'ఎంగేజ్' ఎంపీవీని జులై 5న ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో ఈ 7 సీటర్ ఎంగేజ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ట్రెండింగ్ వార్తలు
జోరు మీద ఉన్న మారుతీ సుజుకీ..
యుటిలిటీ వెహికిల్స్ సెగ్మెంట్లో మారుతీ సుజుకీ హవా కొనసాగుతోంది! ఈ సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు.. గత 12 నెలల్లో ఏకంగా నాలుగు మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు మారుతీ సుజుకీ ఎంగేజ్ ఎంపీవీ పెట్రోల్, హాబ్రీడ్ వేరియంట్లు మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఫ్రాంక్స్, జిమ్నీ ఎస్‌యూవీల తర్వాత.. 3 రో ప్రీమియం ఎంపీవీ ఎంగేజ్ను ఇండియాలో లాంచ్ చేస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రకటించింది ఈ ఆటోమొబైల్ సంస్థ. అప్పటి నుంచి ఎంగేజ్పై ఆటోమొబైల్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.
ఇదీ చూడండి:- Maruti Suzuki Fronx : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ లాంచ్.. ధర ఎంతంటే!
"కేవలం సేల్స్‌ను పెంచుకునేందుకు ఈ మోడల్‌ను లాంచ్ చేయాలని మేము అనుకోవడం లేదు. మార్కెట్లోకి కారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు అర్థమవుతాయి. ప్రస్తుతం టయోటా ఇన్నోవాకు 12 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది," అని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.
Maruti Suzuki Engage MPV : మారుతీ సుజుకీ- టయోటా సంస్థల మధ్య భాగస్వామ్యం ఉంది. ఒప్పందంలో భాగంగా అనే కార్లు రీబ్రాండ్ అయ్యి లాంచ్ అవుతూ ఉంటాయి. గ్రాండ్ విటారా, అర్బన్ క్రూజర్ హైరైడర్ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ రెండు ఎస్‌యూవీలను బిదాదిలోని టయోటా ప్లాంట్‌లో రూపొందిస్తున్నారు. గతంలో బలెనో- గ్లాంజా, బ్రెజా- అర్బన్ క్రూజర్ వంటి మోడల్స్ కూడా రీబ్రాండ్ అయ్యి మార్కెట్లోకి వచ్చాయి.
ఇక 3 రో మోడల్స్ విషయానికొస్తే.. మారుతీ సుజుకికీ ఎర్టిగా, ఎక్స్ఎల్6 మోడల్స్ ఇప్పటికే ఇండియాలో ఉన్నాయి. వీటికి మంచి డిమాండ్ కూడా కనిపిస్తుంది. ఇక ఎంగేజ్ ఎంపీవీతో సంస్థ సేల్స్ మరింత పుంజుకుంటాయని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Maruti Suzuki Engage MPV launch date : మారుతీ సుజుకీ ఎంగేజ్ ఎంపీవీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ఇంజిన్ ఆప్షన్స్, ధర వంటి వివరాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండియాలో టయోటాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా ఉంది ఇన్నోవా. ఈ మోడల్‌ను మారుతీ సుజుకీ తీసుకొస్తుండటం ఆసక్తిగా మారింది.
సంబంధిత కథనం