Maruti Suzuki Fronx : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ లాంచ్​.. ధర ఎంతంటే!-maruti suzuki fronx suv launch check variant wise prices list an other details hee ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Fronx : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Maruti Suzuki Fronx : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Apr 24, 2023 01:21 PM IST

Maruti Suzuki Fronx launched : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ లాంచ్​ అయ్యింది. వేరియంట్ల ధరలతో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ లాంచ్​..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ లాంచ్​..

Maruti Suzuki Fronx launched : ఆటోమొబైల్​ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎట్టకేలకు లాంచ్​ అయ్యింది. జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్​పోలో ఈ ఎస్​యూవీని ప్రదర్శించిన ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. తాజాగా ఫ్రాంక్స్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఫ్రాంక్స్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం వేరియంట్ల ధరలకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. వచ్చేసింది!

దేశంలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు విపరీతమైన డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలో ఎస్​యూవీ పోర్ట్​ఫోలియోను పెంచుకునే పనిలో పడింది మారుతీ సుజుకీ. ఈ క్రమంలోనే ఫ్రాంక్స్​ను లాంచ్​ చేసింది. ఈ మోడల్​కు మంచి బుకింగ్స్​ లభించిన విషయం తెలిందే.

ఇక ఇప్పుడు.. ఫ్రాంక్స్​ను నెక్సా రీటైల్​​ చైన్​ ద్వారా విక్రయిస్తుంది మారుతీ సుజుకీ. ఫలితంగా ఇప్పటికే మంచి డిమాండ్​ ఉన్న బ్రెజాకు ఇదొక ఆల్టర్నేటివ్​గా మారనుంది. మొత్తం మీద ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ను రెండు ఇంజిన్​ ఆప్షన్స్​తో పలు వేరియంట్లలో విక్రయిస్తోంది ఆటోమొబైల్​ సంస్థ. వాటి ఎక్స్​షోరూం ధరలు ఎలా ఉన్నాయి..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ అడ్వాన్స్​డ్​ 1.2లీటర్​ కే-సిరీస్​ డ్యూయెల్​ జెట్​, డ్యూయెల్​ వీవీటీ ఇంజిన్​తో వేరియంట్లు:-

సిగ్మా 5ఎంటీ:- రూ. 7,46,500

డెల్టా 5ఎంటీ:- రూ. 8,32,500

Maruti Suzuki Fronx on road price in Hyderabad : డెల్టా ఏజీఎస్​:- రూ. 8,87,500

డెల్టా+ 5ఎంటీ:- రూ. 8,72,500

డెల్టా+ ఏజీఎస్​:- రూ. 9,27,500.

ఇదీ చూడండి:- Maruti Suzuki Fronx : ఆల్​ న్యూ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఎస్​యూవీ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ..

ఆల్​ న్యూ 1.0 లీటర్​ కే-సిరీస్​ టర్బో బూస్టర్​జెట్​ డైరక్టర్​ ఇంజెక్షన్​ ఇంజిన్​ (ప్రొగ్రెసివ్​ స్మార్ట్​ హైబ్రీడ్​) వేరియంట్లు:-

డెల్టా+ 5ఎంటీ:- రూ. 9,72,500

జీటా 5ఎంటీ:- రూ. 10,55,500

Maruti Suzuki Fronx on road price : జీటా 6ఏటీ:- రూ. 12,05,500

ఆల్ఫా 5ఎంటీ:- రూ. 11,47,500

ఆల్ఫా 6ఏటీ:- రూ. 12,97,500

ఆల్ఫా డ్యూయెల్​ టోన్​ ఎంటీ రూ. 11,63,500

ఆల్ఫా డ్యూయెల్​ టోన్​ ఏటీ:- రూ. 13,13,500

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫీచర్స్​..

Maruti Suzuki Fronx launch date : హెడ్​-అప్​ డిస్​ప్లే యూనిట్​, 9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ స్క్రీన్​, 4 స్పీకర్స్​- 2 ట్వీటర సెటప్​, సుజుకీ కనెక్ట్​ టెలీమాటిక్స్​, ఆండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే సపోర్ట్​, వయర్​లెస్​ ఫోన్​ ఛార్జింగ్​, ఇంజిన్​ స్టార్ట్​- స్టాప్​ బటన్​, క్రూజ్​ కంట్రోల్​, ఫ్రెంట్​ ఫుట్​వెల్​ ఇల్యూమినేషన్​తో పాటు మరిన్ని ఫీచర్స్​ ఈ ఫ్రాంక్స్​ ఎస్​యూవీలో లభిస్తున్నాయి.

ఫ్రాంక్స్​ పొడవు 3,995 ఎంఎం. వెడల్పు 1,765ఎంఎం. ఎత్తు 1,550ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,520ఎంఎం ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం