మొదట ఈ మారుతి సుజుకీ జిమ్నీని ఆటో ఎక్స్ పో 2023లో ఆవిష్కరించారు. తాజాగా, ఈ కారు ధరను కూడా మారుతి సుజుకీ ప్రకటించింది.
భారత్ లో మారుతి సుజుకీ జిమ్నీ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 12.74 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రూ. 12.74 లక్షలు జిమ్నీ బేస్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర. ఈ 5 డోర్ ఎస్ యూవీ జెటా (Zeta), ఆల్ఫా (Alpha), ఆల్ఫా డ్యుయల్ టోన్ (Alpha dual tone) వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలో కూడా ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ అందుబాటులో ఉంది. జెటా మాన్యువల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 12.74 లక్షలు కాగా, జెటా ఆటో వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 13.94 లక్షలు. ఆల్ఫా మాన్యువల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 13.69 లక్షలు కాగా, ఆల్ఫా ఆటో వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 14.89 లక్షలు. ఆల్ఫా డ్యుయల్ టోన్ (Alpha dual tone) మాన్యువల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 13.85 లక్షలు కాగా, ఆల్ఫా డ్యుయల్ టోన్ ఆటో వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.05 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.
ఈ జిమ్నీ కారు సింబల్ ఆఫ్ అడ్వెంచర్ గా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నామని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ హిసాచి టేకూచీ తెలిపారు. ఈ 5 డోర్ ఎస్ యూవీ లో 1.5 లీటర్ కే సిరీస్ ఇంజిన్ ను అమర్చారు. ఇది గరిష్టంగా 6000 ఆర్పీఎం వద్ద 77.1 కిలోవాట్ పవర్ ను, 4000 ఆర్పీఎం వద్ద 134.2 ఎన్ ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి జిమ్నీ గ్రౌండ్ క్లియరెన్స్ , 210ఎంఎం. ఈ కారు 5 స్పీడ్ మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 16.94 కిమీలు, 4 స్పీడ్ ఆటో వేరియంట్ లీటరుకు 16.39 కిమీల మైలేజీ ఇస్తుంది.
మారుతి జిమ్నీలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏబీఎస్ (anti-lock braking system) , ఈబీడీ (electronic brakeforce distribution), బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ఈఎస్పీ (electronic stability program) వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. వాటితో పాటు, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 3 పాయింట్ ఎమర్జెన్సీ లాకింగ్, రిట్రాక్టర్ సీట్ బెల్ట్స్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి కూడా ఉన్నాయి. 2 డ్యుయల్ టోన్ ఆప్షన్స్ సహా మొత్తం 7 రంగుల్లో ఈ మారుతి సుజుకీ జిమ్నీ లభిస్తుంది. పెరల్ ఆర్క్టిక్ వైట్, బ్లూయిష్ బ్లాక్, సిజ్లింగ్ రెడ్, కైనెటిక్ యెల్లో విత్ బ్యూయిష్ బ్లాక్ రూఫ్, సిజ్లింగ్ రెడ్ విత్ బ్యూయిష్ బ్లాక్ రూఫ్, నెక్సా బ్లూ, గ్రానైట్ గ్రే రంగుల్లో ఈ కారు లభిస్తుంది.