తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ముచ్చటగా ముగ్గురు

Congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ముచ్చటగా ముగ్గురు

HT Telugu Desk HT Telugu

30 September 2022, 15:58 IST

  • Congress president elections: ఎట్టకేలకు కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచేదెవరో తేలింది. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజైన సెప్టెంబర్ 30న ముగ్గురు నాయకులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.

నామినేషన్లు దాఖలు చేస్తున్న మల్లిఖార్జున్ ఖర్గే
నామినేషన్లు దాఖలు చేస్తున్న మల్లిఖార్జున్ ఖర్గే (Prateek Kumar)

నామినేషన్లు దాఖలు చేస్తున్న మల్లిఖార్జున్ ఖర్గే

Congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రహాసనం నాటకీయ పరిణామాల మధ్య కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం నాటికి ముగ్గురు నాయకులు బరిలో నిలిచారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Congress president elections: ఖర్గే, థరూర్

పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్, జార్ఖండ్ మంత్రి కేెఎన్ త్రిపాఠీ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ప్రధానంగా ఖర్గే, థరూర్ ల మధ్యనే పోటీ నెలకొనే అవకాశముంది.

Congress president elections: ఖర్గేకే అవకాశాలెక్కువ..

అధిష్టానంపై అసమ్మతి తో లేఖ రాసి సంచలనం సృష్టించిన జీ 23 నాయకుల్లో ఎక్కువమంది కర్నాటకకు చెందిన మల్లిఖర్జున్ ఖర్గేకు మద్దతుగా నిలిచారు. నామినేషన్ల సమయంలో ఖర్గేతో పాటు దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, భూపీందర్ హూడా వచ్చారు. శశి థరూర్ తరఫున 5 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు.

Congress president elections: గాంధీ, నెహ్రూ ఐడియాలజీ

బాల్యం నుంచే కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినయ్యానని నామినేషన్ దాఖలు అనంతరం మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. గాంధీ, నెహ్రూ ఐడియాలజీతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు మద్దతిచ్చిన నేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తనకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు.

Congress president elections: భీష్మ పితామహ తో ఫ్రెండ్లీ ఫైట్

ఖర్గే కు, తనకు మధ్య జరుగుతున్నది ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమేనని శశి థరూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కేంద్రీకృతమైందని, ఆ విధానం మారాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబం తటస్థంగా ఉండాలని నిర్ణయించుకోవడం సముచితమన్నారు. అధ్యక్ష బరిలో తనతో పాటు ఉన్న మల్లిఖార్జున్ ఖర్గేను భీష్మ పితామహ అని అభివర్ణించారు.