తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  July Wpi Inflation: 13.93 శాతానికి తగ్గిన హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం

July WPI inflation: 13.93 శాతానికి తగ్గిన హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం

16 August 2022, 12:58 IST

  • India's July WPI inflation: జూలైలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్భణం 13.93 శాతానికి తగ్గింది.

జూలై మాసంలో హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.18 శాతం నుంచి 13.93 శాతానికి తగ్గినట్టు వెల్లడించిన ప్రభుత్వం
జూలై మాసంలో హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.18 శాతం నుంచి 13.93 శాతానికి తగ్గినట్టు వెల్లడించిన ప్రభుత్వం (Bloomberg)

జూలై మాసంలో హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.18 శాతం నుంచి 13.93 శాతానికి తగ్గినట్టు వెల్లడించిన ప్రభుత్వం

July WPI inflation: దేశ ఆర్థిక వ్యవస్థకు స్వల్ప ఊరట కలిగించే వార్త ఇది. దేశంలో జూలై మాసంలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 13.93 శాతానికి తగ్గింది. జూన్ నెలలో ఇది 15.18 శాతంగా ఉంది. ఈమేరకు ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

రాయిటర్స్ విశ్లేషకుల పోల్ అంచనాల్లో ఇది 14.20 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అంతకంటే కూడా తక్కువగా హోల్ సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం నమోదైంది.

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (WPI inflation) మే నెలలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి పెరిగింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మూడు నెలలుగా పెరుగుతున్న ట్రెండ్‌ను నిలిపివేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన పెరుగుదల.. వరుసగా 16వ నెలలో కూడా రెండంకెల స్థాయిలోనే హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం పెరుగుతోంది.

మానిటరీ పాలసీ రూపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తుంది.

టాపిక్