తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jharkhand Crime News : బంధువును చంపి.. తలతో సెల్ఫీలు దిగి..!

Jharkhand crime news : బంధువును చంపి.. తలతో సెల్ఫీలు దిగి..!

06 December 2022, 6:58 IST

    • Jharkhand crime news : 24ఏళ్ల బంధువును దారుణంగా హత్య చేశాడు ఓ 20ఏళ్ల వ్యక్తి. అక్కడే ఉన్న అతడి స్నేహితులు.. మృతుడి తలతో సెల్ఫీలు దిగారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో చోటుచేసుకుంది.
బంధువును చంపి.. తలతో సెల్ఫీలు దిగి..!
బంధువును చంపి.. తలతో సెల్ఫీలు దిగి..! (Representational image)

బంధువును చంపి.. తలతో సెల్ఫీలు దిగి..!

Jharkhand crime news : ఝార్ఖండ్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా సాగుతున్న భూ వివాదం.. చివరికి ఓ కుటుంబంలో తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. 20ఏళ్ల వ్యక్తి.. తన బంధువును కిడ్నాప్​ చేసి హత్య చేశాడు. అక్కడే ఉన్న అతని స్నేహితులు.. మృతుడి తలతో సెల్ఫీలు దిగారు!

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

భూవివాదం.. చివరికి..!

దసాయ్​ ముండా అనే 55ఏళ్ల వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి కుంటి జిల్లాలోని ముర్హులో నివాసముంటున్నాడు. అతనికి సాగర్​ ముండా అనే పేరుతో బంధువు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది.

కాగా.. ఈ నెల 1వ తేదీన.. పొలం పనుల కోసం దసాయ్​ ముండా కుటుంబం బయటకు వెళ్లింది. అతని కుమారుడు కాను ముండా ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడు. దసాయ్​ ముండా తిరిగి ఇంటికి వెళ్లేసరికి కొడుకు కనిపించలేదు.

Man beheads cousin : కాను ముండాను 20ఏళ్ల సాగర్​ ముండా కిడ్నాప్​ చేసినట్టు.. స్థానికులు దసాయ్​ ముండాకు వివరించారు. కాను ముండాను వెతికేందుకు కుటుంబసభ్యులు పరుగులు తీశారు. ఎంత వెతికినా కాను ముండా ఆచూకీ లభించలేదు. చివరికి మరుసటి రోజు అతను పోలీసులను ఆశ్రయించాడు.

దసాయ్​ ముండా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ముర్హు పోలీస్​ స్టేషన్​ అధికారులు.. రంగంలోకి దిగారు. సాగర్​ ముండా.. అతని స్నేహితులతో కలిసి కాను ముండాను కిడ్నాప్​ చేసినట్టు తెలుసుకున్నారు. 2వ తేదీనే ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సాగర్​ ముండా, అతడి భార్య కూడా ఉన్నారు.

Jharkhand Man beheads relative : విచారణలో భాగంగా.. కాను ముండాను హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. మృతదేహం కోసం వెతికేందుకు పోలీసులు ప్రయత్నించేందుకు ప్రయత్నించారు. దుల్వా టుంగ్రీ ప్రాంతానికి 15కి.మీల దూరంలో మొండెం పడి ఉండటాన్ని గుర్తించారు. అది కాను ముండాదేనని నిర్ధారించారు.

ఈ క్రమంలోనే పోలీసులకు ఓ షాకింగ్​ విషయం తెలిసింది. కాను ముండాను హత్య చేసిన నిందితులు.. అతని తలను శరీరం నుంచి వేరు చేశారు. తలతో సెల్ఫీలు దిగారు.

Crime news India : ఘటనకు సంబంధించిన ఫొటోలను.. నిందితుల ఫోన్​లలో చూశారు పోలీసులు. 5 సెల్​ఫోన్స్​, హత్య కోసం ఉపయోగించిన రెండు ఆయుధాలు, ఓ గొడ్డలి, ఓ ఎస్​యూవీని సీజ్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తును ముమ్మరంగా జరిపి, నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. కాను ముండా కుటుంబానికి పోలీసులు హామీనిచ్చారు.