Medico Murder : పెళ్లికి నిరాకరించిందని మెడికోను మర్డర్ చేసిన లవర్-medico murdered by lover for denying marriage proposal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Medico Murdered By Lover For Denying Marriage Proposal

Medico Murder : పెళ్లికి నిరాకరించిందని మెడికోను మర్డర్ చేసిన లవర్

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 06:56 AM IST

Medico Murder పెళ్లికి నిరాకరించిన మెడికోను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. కృష్ణా జిల్లాకు చెందిన యువతీ యువకుల మధ్య తలెత్తిన విభేదాలతో ప్రియురాలని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ దారుణంగా హత్య చేశాడు. సర్జికల్ బ్లేడ్‌తో మెడ కోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగింది.

పెళ్లికి నిరాకరించిందని మెడికోను హత్య చేసిన ప్రియుడు
పెళ్లికి నిరాకరించిందని మెడికోను హత్య చేసిన ప్రియుడు

Medico Murder పెళ్లికి నిరాకరించిందనే కోపంతో బిడిఎస్‌ విద్యార్ధిని పీకకోసి హతమార్చాడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… విభేదాలను పరిష్కరించుకోడానికి స్నేహితురాలి ఇంటి వెళ్లిన ఈ జంట, అక్కడ కూడా గొడవ పడటంతో ఆవేశంతో ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. సర్జికల్ బ్లేడ్‌తో ప్రియురాలిపై దాడి చేసి కొనప్రాణాలతో ఉన్న ఆమెను మరో గదిలోకి ఈడ్చుకుంటూ వెళ్లి తలుపులు బిగించి హత్యకు పాల్పడ్డాడు. మృతురాలి స్నేహితురాలు ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి బాధితురాలిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపు ప్రాణాలు కోల్పయింది.

ట్రెండింగ్ వార్తలు

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్విని విజయవాడ బిడిఎస్‌ మూడో ఏడాది చదువుతోంది. ఆమెకు కొంత కాలం క్రితం కృష్ణాజిల్లా ఉంగటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌తో ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచియం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి గన్నవరంలో ఉంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తపస్వి, జ్ఞానేశ్వర్‌పై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తక్కెళ్లపాడులో ఉంటున్న స్నేహితురాలికి తన బాధ చెప్పుకుని బాధపడేది. జ్ఞానేశ్వర్ వేధింపులు శృతి మించడంతో గత కొన్ని రోజులుగా స్నేహితురాలి గదిలో ఉంటోంది.

ఈ క్రమంలోనే తపస్వి అచూకీ తెలుసుకున్న జ్ఞానేశ్వర్ వారు ఉంటున్న గదికి వచ్చాడు. ప్రేమికుల మధ్య గొడవల్ని పరిష్కరించడానికి తపస్వి స్నేహితురాలి వారితో మాట్లాడుతుండగా జ్ఞానేశ్వర్‌ను పెళ్లి చేసుకోనని తపస్వి చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో ఆమెపై దాడికి దిగాడు. ఈ పరిణామంతో బెదిరిపోయిన మృతురాలి స్నేహితురాలు కేకలు వేస్తూ కిందకు వెళ్లింది. ఇంటి యజమానిని పైకి పిలుచుకుని వచ్చే లోపు గది తలుపులు బిగించి హత్యకు పాల్పడ్డాడు. జ్ఞానేశ్వర్ గది తలుపులు తీయకపోవడంతో గ్రామస్తులు తలుపులు పగులగొట్టి నిందితుడి బంధించారు. ఆ సమయంలో నిందితుడు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. కొనఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితురాలు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయింది.

మరొకరిని పెళ్లి చేసుకోననడంతోనే….

ఇద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో జ్ఞానేశ్వర్‌ను పెళ్లి చేసుకోనని తపస్వి మాటల మధ్య చెప్పింది. వేరే యువకుడిని పెళ్లి చేసకుంటానని చెప్పడంతో అతను ఆగ్రహానికి గురయ్యాడు. తీవ్ర ఆవేశంతో ఆమెపై దాడి చేశాడు. బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె గొంతుపై అదే పనిగా సర్జికల్ బ్లేడ్‌తో గాయపరిచాడు. ఆ తర్వాత తన చేతిని కోసుకునే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి ప్రేమికులకు సంబంధం లేదని పెదకాకాని పోలీసులు స్పష్టం చేశారు.

స్నేహితురాలి ఇంట్లో మాట్లాడుకోడానికి వచ్చి దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు, మృతురాలిది కృష్ణాజిల్లా కాగా, మృతురాలి తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నట్లు గుర్తించారు. నిందితుడు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నట్లు గుర్తించారు. విభేదాల నేపథ్యంలో నాలుగు నెలల క్రితం తపస్వి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జ్ఞానేశ్వర్‌కు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూడా అతని తీరులో మార్పు రాలేదు. ప్రియురాలిని వేధిస్తుండటంతో అతని నుంచి తప్పించుకోడానికి వేరే ప్రాంతానికి వెళ్లినా ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. మృతి చెందిన విద్యార్ధిని విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజీలో మూడో ఏడాది బిడిఎస్‌ చదువుతున్నట్లు గుర్తించారు.

IPL_Entry_Point