తెలుగు న్యూస్  /  National International  /  Jee Advanced 2023: Iit Guwahati Releases Faqs For Iit Jee Exam At Jeeadv.ac.in

JEE Advanced 2023: ఐఐటీ జేఈఈ కోసం FAQలను విడుదల చేసిన ఐఐటీ గువాహటి

HT Telugu Desk HT Telugu

14 January 2023, 21:48 IST

  • జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) కోసం తరచుగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ (FAQs) ను ఐఐటీ గువాహతి (IIT Guwahati) విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ అడ్వాన్స్డ్ 2023 (JEE Advanced 2023) రాసే విద్యార్థుల కోసం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ (FAQs) ను ఐఐటీ గువాహతి (IIT Guwahati) శనివారం విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

JEE Advanced 2023: వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు

జేఈఈ అడ్వాన్స్డ్ 2023 (JEE Advanced 2023) రాసే విద్యార్థులకు తరచూ వచ్చే సందేహాలు, అనుమానాలను, వాటికి సమాధానాలను క్రోడీకరించి తరచుగా అడిగే ప్రశ్నలుగా IIT Guwahati రూపొందించింది. వాటిని అఫీషియల్ వెబ్ సైట్లో పొందుపర్చింది. ఈ jeeadv.ac.in వెబ్సైట్లో ఆ ఎఫ్ఏక్యూ(FAQ)లను విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఎఫ్ఏక్యూలు(FAQs) ఈ సంవత్సరం జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE advanced 2023) కు మాత్రమే వర్తిస్తాయని ఐఐటీ గువాహటి (IIT Guwahati) స్పష్టం చేసింది.

JEE Advanced 2023: పరీక్ష ఎప్పుడు?

జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) ను ఈ సంవత్సరం జూన్ 4వ తేదీన రెండు షిఫ్ట్ ల్లో నిర్వహించనున్నారు. పేపర్ 1 ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్ష (JEE Advanced) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం jeeadv.ac.in వెబ్ సైట్ ను తరచుగా చెక్ చేస్తూ ఉండండి.

JEE Advanced 2023: FAQsను చెక్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2023) అఫీషియల్ వెబ్ సైట్ jeeadv.ac.in ను సందర్శించాలి.
  • హోం పేజీపై కనిపించే JEE Advanced 2023 FAQs పై క్లిక్ చేయాలి.
  • ప్రశ్నలు, జవాబులతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే, డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

Direct link to check JEE Advanced 2023 FAQs

టాపిక్