తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Itbp Recruitment 2023: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

ITBP recruitment 2023: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

HT Telugu Desk HT Telugu

06 June 2023, 21:58 IST

    • ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 81 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (Indo-Tibetan Border Police Force ITBP) లో హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 81 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇది ప్రత్యేకంగా హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) పోస్ట్ ల భర్తీకి ఉద్దేశించిన నోటిఫికేషన్. ఈ పోస్ట్ లు నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ గ్రూప్ 2 ఉద్యోగాల కేటగిరీలోకి వస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఆన్ లైన్ లో అప్లై..

ఐటీబీపీ (Indo-Tibetan Border Police Force ITBP) లో హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) పోస్ట్ లకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో, ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ లకు జూన్ 9వ తేదీ నుంచి జులై 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

ఇతర వివరాలు..

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) పోస్ట్ లకు సంబంధించిన విద్యార్హతలు, వయో పరిమితి, రిజర్వేషన్ల వంటి వివరాలకు ఐటీబీపీ అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.in. లో అప్ లోడ్ చేసిన సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అన్ని కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే, ఎవరు కూడా అప్లికేషన్ ఫీజ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే, విద్యార్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫరీ (Auxiliary Nursing Midwifery) కోర్స్ ను పూర్తి చేసి ఉండాలి. అలాగే, కేంద్రానికి చెందిన, లేదా రాష్ట్రాలకు చెందిన నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.

వేకెన్సీల వివరాలు..

మొత్తం 81 హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 34 జనరల్ కేటగిరీకి, 22 ఓబీసీలకు, 12 ఎస్సీలకు, 6 ఎస్టీలకు, 7 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ చేశారు. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడేళ్లు మినహాయింపునిచ్చారు.