తెలుగు న్యూస్  /  National International  /  Indusind Bank Q2: Net Profit Rises By 60.4% To <Span Class='webrupee'>₹</span>1,786.72 Cr

IndusInd Bank Q2 results: Q2 లో 60.4 శాతం పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలు

HT Telugu Desk HT Telugu

19 October 2022, 18:14 IST

  • IndusInd Bank Q2 results: భారత్ లోని ప్రైవేటు బ్యాంక్ ల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ Q2 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై టు సెప్టెంబర్) ఫలితాలను ఇండస్ ఇండ్ బ్యాంక్ బుధవారం విడుదల చేసింది. Q2లో ఇండస్ ఇండ్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 60.4% పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Canada working hours: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్; ఇక వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్

Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

Stabbings in London: లండన్ లో కత్తితో దుండగుడి వీరంగం; పలువురికి గాయాలు

Chhattisgarh encounter: మావోలకు మరో ఎదురు దెబ్బ; ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి

IndusInd Bank Q2 results: రూ. 1786 కోట్లు..

ఇండస్ ఇండ్ బ్యాంక్ Q2 ఫలితాలు బ్యాంకింగ్ సెక్టార్ కు శుభ సూచనలుగా ఉన్నాయి. ఈ రెండో త్రైమాసికంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ గా రూ. 1786.72 కోట్లను ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలానికి ఈ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ రూ. 1113.53 కోట్లు మాత్రమే. అలాగే, ఈ Q2లో నెట్ ఇంట్రెస్ట్ ఆదాయం 18% పెరిగింది. Q2లో ఇండస్ ఇండ్ బ్యాంక్ స్థూల వడ్డీ ఆధాయం రూ. 4,302 కోట్లు.

IndusInd Bank Q2 results: ఆపరేటింగ్ ప్రాఫిట్

ఈ ఆర్థిక సంవత్సరం Q2 లో బ్యాంక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 3,519.66 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం Q2లో అది రూ. 3,178.05 కోట్లు. అంటే, ఆపరేటింగ్ ప్రాఫిట్ లో 11% వృద్ధి నమోదైంది. అలాగే, బ్యాంక్ బ్యాడ్ లోన్స్ లోనూ తగ్గుదల నమోదైంది. జూన్ తో ముగిసే త్రైమాసికంలో ఈ బ్యాడ్ లోన్స్ 2.35 శాతం ఉండగా, Q2లో అది 2.11 శాతంగా నమోదైంది. కాగా, బుధవారం ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ ధర స్వల్పంగా తగ్గింది.