తెలుగు న్యూస్  /  National International  /  India Trade Deficit Widened To 28 Bn Dollars In August 2022

Trade deficit in August: ఆగస్టులో రెట్టింపైన వాణిజ్య లోటు

HT Telugu Desk HT Telugu

14 September 2022, 17:09 IST

    • Trade deficit in August: భారత వాణిజ్య లోటు ఆగస్టు మాసంలో రెట్టింపైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
పెరుగుతున్న దిగుమతుల భారం (ప్రతీకాత్మక చిత్రం)
పెరుగుతున్న దిగుమతుల భారం (ప్రతీకాత్మక చిత్రం) (Bloomberg)

పెరుగుతున్న దిగుమతుల భారం (ప్రతీకాత్మక చిత్రం)

Trade deficit in August: భారత వాణిజ్య లోటు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రెట్టింపై 27.98 బిలియన్ డాలర్లకు చేరుకుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.

ట్రెండింగ్ వార్తలు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Delhi school: ఢిల్లీ స్కూల్స్ కు బాంబు బెదిరింపులు : 'ఫేక్' గా భావిస్తున్న పోలీసులు

ఎగుమతులు స్వల్పంగా 1.62 శాతం పెరిగి 33.92 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన డేటా తెలిపింది. ఆగస్టు 2021లో వాణిజ్య లోటు 11.71 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ ఏడాది ఆగస్టులో దిగుమతులు 37.28 శాతం పెరిగి 61.9 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

ఏప్రిల్-ఆగస్టు (2022-23) మధ్య కాలంలో ఎగుమతులు 17.68 శాతం వృద్ధితో 193.51 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఐదు నెలల కాలంలో దిగుమతులు 45.74 శాతం పెరిగి 318 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టులో వాణిజ్య లోటు 124.52 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 53.78 బిలియన్ డాలర్లుగా ఉంది.