తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Alert : ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్​

IMD alert : ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్​

30 October 2022, 17:12 IST

    • Heavy rain alert : ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. నవంబర్​ 3 వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్​
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్​ (HT_PRINT)

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్​

Heavy rain alert : తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాలకు వర్ష సూచనను ఇచ్చింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). ఆదివారం నుంచి నవంబర్​ 3 వరకు ఆయా ప్రాంతాలతో పాటు కరైకల్​, మాహేలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ప్రజలను అలర్ట్​ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

ఆదివారం నాటికి రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ-మాహే, కరైకల్​, పుదుచ్చేరి, తమిళనాడులోకి ఈశాన్య రుతుపవనాలు చేరుకున్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతం, యానాంకు ఆదివారం నుంచి నవంబర్​ 2 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమలో నవంబర్​ 1,2 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Heavy rains in AP : దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్​ 3న భారీ వర్షాలు పడతాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్​లో సోమ, మంగళవారాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయి.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​, గిల్గిత్​, బాల్టిస్థాన్​, ముజాఫర్​బాద్​లో సోమవారం నుంచి బుధవారం వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయి. హిమాచల్​ ప్రదేశ్​లో నవంబర్​ 1న వర్షాలు పడతాయి.

Heavy rains in Tamil Nadu : భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు మీదకు వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. పలు ప్రాంతాలు జలమయం అవ్వొచ్చు. ముఖ్యమైన నగరాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చు. పంటకు నష్టం జరగవచ్చు. ఈ విషయాలు చెబుతూ.. ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసింది ఐఎండీ.