తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Rain Alert To South Coastal Districts Of Andhra Pradesh

Weather Alert : కోస్తాకు మళ్లీ భారీ వర్ష సూచన

HT Telugu Desk HT Telugu

30 October 2022, 13:11 IST

    • Weather Alert దక్షిణ కోస్తా తీరంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తమిళనాడుకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 
దక్షిణ కోస్తాలో మళ్లీ వర్షాలు
దక్షిణ కోస్తాలో మళ్లీ వర్షాలు

దక్షిణ కోస్తాలో మళ్లీ వర్షాలు

Weather Alert దక్షిణ కోస్తాంధ్రకు మళ్లీ వర్ష సూచన.. అల్ప పీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలతో పాటు తమిళనాడు వైపుగా తిరుపతి, నెల్లూరు, అలాగే రాయలసీమ జిల్లాల్లోని తూర్పు భాగాలతో పాటుగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్షాలు మరింత తీవ్రంగా కోస్తా భాగాల్లో ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

అక్టోబర్ 31 రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 31 తెల్ల వారు జాము నుంచి లేకుంటే అక్టోబర్ 31 అర్ధరాత్రి సమయంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. నవంబర్ 1, 2, 3, 4 తేదీల వరకు వర్షాలు కొనసాగనున్నాయి. నవంబర్ 1,2 తేదీలలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది.

వర్షాలు అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో ఎక్కువగా కురిసే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కృష్ణపట్నం, మైపాడు, తూపిలిపాలెం, శ్రీహరికోట ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కనిపించనున్నాయి. మరో వైపు నెల్లూరు నగరం, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి వైపు మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1,2 తేదీలలొ భారీ వర్షాలు కురువనున్నాయి. . నవంబర్ 3 మరియు 4 మాత్రం చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.

ప్రకాశం, అన్నమయ్య జిల్లా తూర్పు భాగాలు, కడప, జిల్లా తూర్పు భాగాల్లో, చిత్తూరు తూర్పు భాగాల్లో బాపట్లలోని కోస్తా భాగాలతో పాటు , కృష్ణా జిల్లాలోని కోస్తా ప్రాంతాలు, కోనసీమ , పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

చిట్వేల్, ఒంగోలు, కందుకూరు, బద్వేల్, మచిలీపట్నం, అమలాపురం, నర్సాపురం ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వర్షాలు నవంబర్ 1 నుంచి వర్షాలు మొదలై, నవంబర్ 2 నుంచి తగ్గుతూ నవంబర్ 4 కి పూర్తిగా తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు.

అనంతపురం, సత్యసాయి, నంధ్యాల​, కర్నూలు జిల్లాల్లో నవంబర్ 1 రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయి. ఎన్.టీ.ఆర్., గుంటూరు, పల్నాడు, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎగువ ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తా జిల్లాల్లో ఎగువ ప్రాంతాల్లో నవంబర్ 3 నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయి

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటి కంటే తక్కువగా వర్షాలు పడనున్నాయి. నవంబర్ 2 ,3 తేదీల్లో వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అడపదడపగా వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర​, గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీలలో చలి గాలులు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

టాపిక్