తెలుగు న్యూస్  /  National International  /  How To Make Rupees 66 Lakh By Investing 411 Per Day In Sukanya Samriddhi Account

Sukanya Samriddhi Account: రోజుకు రూ. 411 పొదుపుతో రూ. 66 లక్షలు పొందండిలా

HT Telugu Desk HT Telugu

28 September 2022, 17:22 IST

  • Sukanya Samriddhi Account: సుకన్య సమృద్ధి యోజన పథకం రూపంలో ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మెరుగైన పొదుపు పథకాన్ని ఎంచుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకం
సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకం

సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకం

Sukanya Samriddhi Account: కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. సుకన్య సమృద్ధి యోజన పరిధిలో అమ్మాయి పేరు మీద ఖాతా తెరవొచ్చు. బాలికలకు పదేళ్ల వయస్సు వచ్చే వరకూ ఈ ఖాతా తెరవచ్చు. ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీసుల్లోనూ, అధీకృత బ్యాంకుల్లోనూ తెరవొచ్చు. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇద్దరికీ ఖాతా తెరవచ్చు. ప్రస్తుతం ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులో ఉన్న వడ్డీ 7.6 శాతం. దీనిని వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిస్తే ఏటా కనీసంగా రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 వరకు పొదుపు చేయాలి.

రోజుకు రూ. 411 పొదుపు ద్వారా రూ. 66 లక్షలు ఇలా సంపాదించొచ్చు..

ఒక వ్యక్తి 15 ఏళ్ల పాటు ఏటా రూ. 1.5 లక్షల చొప్పున పొదుపు చేస్తే ఆ మొత్తం రూ. 22,50,000 అవుతుంది. అంటే రోజుకు రూ. 411 పొదుపు చేస్తారన్న మాట. బాలికకు 21 ఏళ్ల వయస్సు వచ్చాక ఆమె పేరిట రూ. 65,93,071 (రూ.22,50,000 అసలు, రూ. 43,43,071 వడ్డీ) జమవుతాయి.

Tax benefits under Sukanya Samriddhi Account: ఈ పథకం పన్ను ఆదా ఇలా

సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతాదారులు ఈ కింద పన్ను రాయితీలు పొందుతారు.

(1.) సుకన్య సమృద్ధి యోజన పథకంలో పొదుపు చేసే మొత్తం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందవచ్చు.

(2.) వార్షిక మినహాయింపు రూ. 1.5 లక్షల వరకు లభిస్తుంది.

(3.) సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా లభ్యమైన వడ్డీకి కూడా ఆదాయ పన్నులోని సెక్షన్ 10 కింద మినహాయింపు వర్తిస్తుంది.

(4.) మెచ్యూరిటీ సమయంలో, ఉపసంహరణ సమయంలో వచ్చే నగదు మొత్తం పన్ను పరిధిలోకి రాదు.