తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  How To Change Photo In Aadhaar Card : ఆధార్​ కార్డులో ఫొటో మార్చడం ఎలా?

How to change photo in Aadhaar card : ఆధార్​ కార్డులో ఫొటో మార్చడం ఎలా?

03 January 2023, 13:59 IST

    • How to change photo in Aadhaar card : ఆధార్​ కార్డులో ఫొటో మార్చాలని అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్​ చాలా సింపుల్​. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఆధార్​ కార్డులో ఫొటో మార్చడం ఎలా?
ఆధార్​ కార్డులో ఫొటో మార్చడం ఎలా?

ఆధార్​ కార్డులో ఫొటో మార్చడం ఎలా?

How to change photo in Aadhaar card : రోజువారీ జీవితంలో ఆధార్​ కార్డు చాలా అవసరం. ఏం పని చేయాలనుకున్నా.. ఇప్పుడు ఆధార్​ తప్పనిసరిగా మారిపోయింది. మీరు మీ ఆధార్​ కార్డులో ఫొటోను మార్చుకోవాలని చూస్తున్నారా? ఆధార్​ కార్డులో ఫొటో మార్చుకునే ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఆధార్​ కార్డులో ఫొటో మార్చడం ఎలా?

స్టెప్​ 1:- యూఐడీఏఐ అధికారిక వెబ్​సైట్​ uidai.gov.in లోకి వెళ్లాలి.

స్టెప్​ 2:- ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ ఫామ్​ మీద క్లిక్​ చేయాలి.

Aadhar card photo update process : స్టెప్​ 3:- ఫామ్​ను పూర్తిగా ఫిల్​ చేయాలి. ఆ తర్వాత సమీపంలోని ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ సెంటర్​ లేదా ఆధార్​ సేవా కేంద్రలో దానిని సమర్పించాలి.

స్టెప్​ 4:- అక్కడే మీ బయోమెట్రిక్​ వెరిఫికేషన్​ ప్రక్రియ జరుగుతుంది.

స్టెప్​ 5:- మీ కొత్త ఫొటోను అక్కడి ఎగ్జిక్యూటివ్​ తీసుకుంటారు. దానిని మీ ఆధార్​ కార్డ్​కు యాడ్​ చేస్తారు.

స్టెప్​ 6:- ఈ సర్వీసు కోసం రూ. 100+ జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్నాలెడ్​మెంట్​ స్లిప్​ను మీకు అందిస్తారు. దానితో పాటు యూఆర్​ఎన్​ (అప్డేటెడ్​ రిక్వెస్ట్​ నెంబర్​) కూడా ఇస్తారు.

Aadhar card latest news : యూఐడీఏఐలోకి వెళ్లి మీ యూఆర్​ఎన్​ నెంబర్​ను టైప్​ చేస్తే.. మీ రిక్వెస్ట్​ స్టేటస్​ను కూడా మీరు ట్రాక్​ చేయవచ్చు. అయితే మీ ఆధార్​ కార్డులో ఫొటో మార్చే ప్రక్రియకు కనీసం 90రోజుల సమయం పట్టొచ్చు. ఆ తర్వాత ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ సెంటర్​కు వెళ్లి మీ అప్డేటెడ్​ ఆధార్​ కార్డును ప్రింట్​ చేసుకోవచ్చు. లేదా మీ అప్డేటెడ్​ ఆధార్​ కార్డును యూఐడీఏఐ వెబ్​సైట్​లో నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలా అంటే..

స్టెప్​ 1:- యూఐడీఏఐ వెబ్​సైట్​కు వెళ్లి.. డౌన్​లోడ్​ ఆధార్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 2:- ఆధార్​ నెంబర్​, ఎన్​రోల్​మెంట్​ ఐడీ లేదా వర్చువల్​ ఐడీ ఎంటర్​ చేయాలి.

స్టెప్​ 3:- క్యాప్చా ఎంటర్​ చేసి 'సెండ్​ ఓటీపీ' ఆప్షన్​ను క్లిక్​ చేయాలి.

స్టెప్​ 4:- ఓటీపీ ఎంటర్​ చేసి.. వెరిఫై అండ్​ డౌన్​లోడ్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి. మీ ఆధార్​ కార్డు డౌన్​లోడ్​ అవుతుంది.