తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఎల్ఐసీ ఇష్యూ ప్రైస్ రూ. 949.. ఫిక్స్ చేసిన కేంద్రం

ఎల్ఐసీ ఇష్యూ ప్రైస్ రూ. 949.. ఫిక్స్ చేసిన కేంద్రం

HT Telugu Desk HT Telugu

13 May 2022, 16:14 IST

  • న్యూఢిల్లీ, మే 13: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ మార్కెట్లో లిస్టింగ్‌ అయ్యే ముందు.. ప్రభుత్వం దాని షేర్ల ఇష్యూ ధరను ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌లో ఎగువ ముగింపు ధర రూ. 949గా ఫిక్స్ చేసింది.

లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయం
లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయం (REUTERS)

లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓ మే 9న ముగిసింది. మే 12న బిడ్డర్‌లకు షేర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం ఈ ఐపీఓ ద్వారా 22.13 కోట్ల షేర్లు (3.5 శాతం వాటా) విక్రయించింది. 

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

ఎల్ఐసీ రిటైల్ ఇన్వెస్టర్లు, అర్హులైన ఉద్యోగులకు ఇష్యూ ధరపై ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 45 డిస్కౌంట్ లభించగా, పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ. 60 తగ్గింపు లభించింది.

మే 12న ఎల్‌ఐసీ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం షేర్ ఆఫర్ ధర ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 949గా నిర్ణయించారు.

ప్రభుత్వం ఫిక్స్ చేసిన షేరు ధరలో డిస్కౌంట్ పోనూ ఎల్‌ఐసీ పాలసీదారులు రూ. 889 చొప్పున, రిటైల్ పెట్టుబడిదారులు రూ. 904 చొప్పున షేర్లను పొందారు.

పాలసీదారులు, రిటైల్ పెట్టుబడిదారులకు వర్తించే తగ్గింపును వర్తింపజేసిన తర్వాత షేర్ల కేటాయింపు పూర్తయ్యింది. వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 20,557 కోట్ల ఆదాయం సమకూరింది.

ఎల్ఐసీ ఐపీఓ ఇప్పటి వరకు దేశంలో అతి పెద్ద ఐపీఓ. దాదాపు 3 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో ముగిసింది. ప్రధానంగా రిటైల్, సంస్థాగత కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. 

2021లో పేటీఎం ఐపీఓ ద్వారా మొత్తం రూ. 18,300 కోట్లు సమీకరించింది. కోల్ ఇండియా (2010) దాదాపు రూ. 15,500 కోట్లు, రిలయన్స్ పవర్ (2008) రూ. 11,700 కోట్లు సమీకరించింది.

ప్రస్తుతం ఉన్న అస్థిరమైన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఎల్ఐసీ గత నెలలో దాని ఐపీఓ పరిమాణాన్ని 5 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించింది. రూ. 20,557 కోట్లకు పైగా పరిమాణం తగ్గింది. అయినప్పటికీ ఎల్ఐసీ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌గా నిలిచింది. ఎల్ఐసీ షేర్లు లిస్టింగ్ తరువాత మే 17 నుండి స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతాయి.

టాపిక్