తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Axis Bank Shares : 5 శాతం నష్టపోయిన యాక్సిస్ బ్యాంక్ షేర్

Axis Bank shares : 5 శాతం నష్టపోయిన యాక్సిస్ బ్యాంక్ షేర్

HT Telugu Desk HT Telugu

29 April 2022, 11:15 IST

  • యాక్సిస్ బ్యాంకు షేర్లు నాలుగో త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం శుక్రవారం ఐదు శాతం నష్టపోయాయి.

యాక్సిస్ బ్యాంక్ బ్రోచర్
యాక్సిస్ బ్యాంక్ బ్రోచర్ (REUTERS)

యాక్సిస్ బ్యాంక్ బ్రోచర్

మార్చి త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభంలో 49.77 శాతం జంప్ చేసినట్లు కంపెనీ నివేదించిన ఒక రోజు తర్వాత శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంక్ షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి. బిఎస్‌ఇలో ఈ షేరు 5.23 శాతం తగ్గి రూ. 739.10కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో 5.21 శాతం పతనమై రూ.739.10కి చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

యాక్సిస్ బ్యాంక్ గురువారం మార్చి త్రైమాసికంలో దాని ఏకీకృత నికర లాభంలో 49.77 శాతం జంప్ చేసి రూ. 4,434 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిల కోసం కేటాయించిన నిల్వ బాగా తగ్గడంతో ఇది సాధ్యపడింది.

మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత దాని పన్ను అనంతర నికర లాభంలో 54 శాతం పెరిగి రూ. 4,118 కోట్లకు చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, పన్ను అనంతర లాభంలో 98 శాతం పెరిగి రూ. 13,025 కోట్లుగా నమోదైంది.

స్థూల నిరర్థక ఆస్తులు గత ఏడాది కాలంతో పోలిస్తే 3.70 శాతం నుండి 2.82 శాతానికి తగ్గాయి. అయితే స్థూల స్లిప్పేజ్‌లు రూ. 3,981 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు డిసెంబర్ త్రైమాసికంలో రూ. 4,147 కోట్లుగా ఉన్నాయి.

బలమైన రికవరీల కారణంగా ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ రూ. 41.2 బిలియన్ల వద్ద ఉన్నప్పటికీ.. బలహీనమైన మార్జిన్ల కారణంగా నిర్వహణ ఆదాయం అంచనాల కంటే 4 శాతం తక్కువగా ఉండడంతో యాక్సిస్ బ్యాంక్ ఆదాయాలు మిశ్రమంగా ఉన్నాయని ప్రభుదాస్ లిల్లాధర్‌ సంస్థ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ జానీ తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం