తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi's Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ యాత్రలో ఎమోషనల్ సీన్

Rahul Gandhi's Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ యాత్రలో ఎమోషనల్ సీన్

HT Telugu Desk HT Telugu

28 September 2022, 17:02 IST

  • Rahul Gandhi's Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేరళలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

రాహుల్ ను కలిసిన బాలిక సంతోషం
రాహుల్ ను కలిసిన బాలిక సంతోషం

రాహుల్ ను కలిసిన బాలిక సంతోషం

Rahul Gandhi's Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బుధవారానికి 18వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కేరళలో యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం వాయినాడ్ లో అడుగు పెడ్తారు.

ట్రెండింగ్ వార్తలు

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ​ స్పేస్​ మిషన్​ రద్దు!

Rahul Gandhi's Bharat Jodo Yatra: బాలిక ఆనందోద్వేగం..

రాహుల్ గాంధీ వందలాది మద్దతుదారులతో కలిసి 18వ రోజు బుధవారం యాత్ర ప్రారంభించారు. యాత్ర పండిక్కడ్ లో ప్రారంభమై, వాండూర్ జంక్షన్ వద్ద చిన్న బ్రేక్ తీసుకుంటుంది. యాత్ర సమయంలో రాహుల్ గాంధీ వద్దకు వచ్చిన ఒక బాలిక ఆనందం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టడం అక్కడి వారిని విస్మయపరిచింది. ఆ బాలిక కన్నీళ్లు పెడుతూ, గంతులు వేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే, రాహుల్ గాంధీ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. నడుస్తూనే, కాసేపు ఆ బాలికతో, ఆమెతో వచ్చిన మరొకరితో మాట్లాడారు. రాహుల్ పక్కన ఉన్నంత సేపు ఆ బాలిక సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బాలికను అక్కడి వారంతా నవ్వుతూ గమనిస్తూ ఉండిపోయారు. మరికొందరు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా, ఏ సినిమా స్టార్ కో, ఎంటర్టైన్ మెంట్ రంగంలోని సెలబ్రిటీలకో లభించే ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ యాత్రలో రాహుల్ కు లభిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Rahul Gandhi's Bharat Jodo Yatra: వాయినాడ్ లోకి..

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం తన సొంత నియోజకవర్గం వాయినాడ్ లో ప్రవేశిస్తారు. దాదాపు 3 రోజుల పాటు తన నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర ఉంటుంది. కేరళ లో పాదయాత్ర అనంతరం కర్నాటకలోకి అక్టోబర్ 1వ తేదీన ఆయన అడుగుపెడ్తారు.