తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Flipkart Audiobooks: ఆడియోబుక్స్‌లోకి ఫ్లిప్‌కార్ట్.. పాకెట్ ఎఫ్ఎంతో జట్టు

Flipkart audiobooks: ఆడియోబుక్స్‌లోకి ఫ్లిప్‌కార్ట్.. పాకెట్ ఎఫ్ఎంతో జట్టు

HT Telugu Desk HT Telugu

26 July 2022, 13:41 IST

  • Flipkart audiobooks: ఫ్లిప్‌కార్ట్ ఆడియో బుక్స్ సెగ్మెంట్లోకి అడుగుపెడుతోంది. పోటీదారు అమెజాన్ ఆడిబుల్‌ దారిలో పయనిస్తోంది.

ఆడియో బుక్స్ సెగ్మెంట్‌లోకి రానున్న ఫ్లిప్‌కార్ట్
ఆడియో బుక్స్ సెగ్మెంట్‌లోకి రానున్న ఫ్లిప్‌కార్ట్ (REUTERS)

ఆడియో బుక్స్ సెగ్మెంట్‌లోకి రానున్న ఫ్లిప్‌కార్ట్

ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఆడియో బుక్స్ కేటగిరీలోకి ప్రవేశిస్తోంది. ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్ పాకెట్ ఎఫ్ఎం భాగస్వామ్యంతో కొత్త సెగ్మెంట్లోకి ప్రవేశించింది.

40 కోట్ల మేర ఉన్న తన వినియోగదారులకు ఎక్స్‌క్లూజివ్ ఆడియోబుక్స్‌ను పాకెట్ ఎఫ్ఎం ద్వారా అందుబాటులోకి తేనుంది. ఇండియాలో దాదాపు 2.5 కోట్ల మంది ఆడియో బుక్స్ వింటారని అంచనా.

ఫ్లిప్‌కార్ట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ హెడ్ కంచన్ మిశ్రా మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆడియో బుక్స్ బాగా ప్రాచుర్యం పొందాయని, పాకెట్ ఎఫ్ఎంతో కలిసి రచయితలకు సహకారం అందించడం ద్వారా ఆడియోబుక్స్ తేనున్నామని తెలిపారు.

ప్రాంతీయ కంటెంట్‌పై యూజర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సేవ అందించడం ఫ్లిప్‌కార్ట్ కంపెనీకి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో ఆరంభించిన పాకెట్ ఎఫ్ఎం ఆడియో బుక్ ప్లాట్‌ఫామ్ ప్రతి నెలా 1,20,000 ఆడియోబుక్స్ అమ్ముతుందని ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసిన ఓ ప్రకటన వెల్లడించింది.

టాపిక్