తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : మూడోసారి ప్రధానిగా మోదీ.. తొలి సంతకం ఈ ఫైల్​ పైనే!

PM Modi : మూడోసారి ప్రధానిగా మోదీ.. తొలి సంతకం ఈ ఫైల్​ పైనే!

Sharath Chitturi HT Telugu

10 June 2024, 12:29 IST

google News
  • PM Modi latest news : మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన రోజే.. యాక్షన్​లోకి దిగారు పీఎం మోదీ. తొలి సంతకం దేనిపైన చేశారంటే..

ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ..

PM Kisan Nidhi : మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. సోమవారం ఉదయం తన పనిని ప్రారంభించారు నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా.. పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్​పై తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద.. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, సుమారు రూ .20,000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

"రైతన్న అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. అందుకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైల్​పై తొలి సంతకం చేశాను. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగం కోసం మరింత కృషి చేయాలనుకుంటున్నాము,' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

2024 లోక్​సభ ఎన్నికల్లో గ్రామీణ భారతం నుంచి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. రైతు సంక్షేమం పట్ల ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

PM kisan nidhi latest news : 72 మంది సభ్యులున్న కేంద్ర మంత్రివర్గానికి నేతృత్వం వహిస్తూ మోదీ ఆదివారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు అత్యధిక ప్రాతినిధ్యం లభించగా.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా గణనీయమైన ప్రాతినిధ్యం లభించింది.

ఇదీ చూడండి:- Modi oath ceremony : ‘మోదీ అనే నేను..’- అట్టహాసంగా నరేంద్రుడి పట్టాభిషేకం!

లోక్​సభకు అత్యధికంగా 80 మంది సభ్యులను పంపే ఉత్తర్​ప్రదేశ్​కు ఒక కేబినెట్​తో సహా తొమ్మిది మంత్రి పదవులు లభించగా, బీహార్ రాష్ట్రం నుంచి మొత్తం ఎనిమిది మంది మంత్రులవ్వగా.. వారిలో నలుగురు మంత్రి పదవిని పొందారు.

PM Modi new cabinet news : ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గంలో మహారాష్ట్రకు ఇద్దరు కేబినెట్ మంత్రులతో సహా ఆరు మంత్రి పదవులు ఉండగా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​లకు చెరో ఐదుగురు సభ్యులు ఉన్నారు.

హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెరో మూడు మంత్రి పదవులు దక్కాయి.

ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలకు చెందిన తలో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కింది.

ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్​నాథ్ సింగ్ ఒక్కరే కేబినెట్ మంత్రి కాగా, గుజరాత్ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్ కేబినెట్ మంత్రులుగా అయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం(ఎస్), రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్) (జేడీయూ), గిరిరాజ్ సింగ్ (బీజేపీ), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ) నుంచి నలుగురు కేబినెట్ మంత్రులుగా ఉన్నారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా కేబినెట్ బెర్తులో ఉండగా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మోదీ 3.0 కేబినెట్​లోని మంత్రుల వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం