Stocks market news : లోక్​సభ ఎన్నికల వేళ.. స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు!-stocks market news today lok sabha election results 2024 sensex and nifty ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks Market News : లోక్​సభ ఎన్నికల వేళ.. స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు!

Stocks market news : లోక్​సభ ఎన్నికల వేళ.. స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు!

Sharath Chitturi HT Telugu
Jun 04, 2024 09:26 AM IST

Stocks market news : లోక్​సభ ఎన్నికల ఫలితాల వేళ.. ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్​ మార్కెట్​ న్యూస్​..
స్టాక్​ మార్కెట్​ న్యూస్​..

Stocks market news today : లోక్​సభ ఎన్నికల ఫలితాల వేళ దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ నష్టాల్లో ఉన్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 124 పాయింట్ల నష్టంతో 75,166 వద్ద ఉంది. నిఫ్టీ.. 404 పాయింట్లు కోల్పోయి 22,859 వద్ద సెషన్​ని కొనసాగిస్తోంది. బ్యాంక్​ నిఫ్టీ.. 737 పాయింట్ల నష్టంతో 50,247 వద్ద ఉంది.

లోక్​సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని స్టాక్​ మార్కెట్​ నిపుణులు సూచించారు. బిగినర్లు.. ట్రేడింగ్​కి దూరంగా ఉండటం శ్రేయస్కరం అని అంటున్నారు.

లోక్​సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ గెలుపు ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ తేల్చడంతో.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 2507 పాయింట్లు పెరిగి 76,469 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 733 పాయింట్లు వృద్ధి చెంది 23,264 వద్ద ముగిసింది. ఇక 1996 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 50,980 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Lok Sabha elections 2024 : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6851 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 1914 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.3శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.1శాతం, నాస్​డాక్​ 0.56శాతం పెరిగాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy today : రిలయన్స్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 3020.65, స్టాప్​ లాస్​ రూ. 2900, టార్గెట్​ రూ. 3240

ఎల్​ఐసీ హౌజింగ్​ ఫైనాన్స్​:- బై రూ. 678.7, స్టాప్​ లాస్​ రూ. 657, టార్గెట్​ రూ. 730

ఎస్​ఆర్​ఎఫ్​:- బై రూ. 2270, స్టాప్​ లాస్​ రూ. 2210, టార్గెట్​ రూ. 2380

యూకో బ్యాంక్​:- బై రూ. 62, స్టాప్​ లాస్​ రూ. 58, టార్గెట్​ రూ. 68

జేటీఎల్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 215, స్టాప్​ లాస్​ రూ. 230, టార్గెట్​ రూ. 260

ఎఫ్​ఏసీటీ:- బై రూ. 703, స్టాప్​ లాస్​ రూ. 688, టార్గెట్​ రూ. 745

కొచిన్​ షిప్​యార్డ్​:- బై రూ. 2010, స్టాప్​ లాస్​ రూ. 1950, టార్గెట్​ రూ. 2130

రెయిల్​టెల్​:- బై రూ. 430, స్టాప్​ లాస్​ రూ. 418, టార్గెట్​ రూ. 455

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం