Modi oath ceremony : ‘మోదీ అనే నేను..’- అట్టహాసంగా నరేంద్రుడి పట్టాభిషేకం!-narendra modi takes oath as prime minister for the 3rd time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Modi Oath Ceremony : ‘మోదీ అనే నేను..’- అట్టహాసంగా నరేంద్రుడి పట్టాభిషేకం!

Modi oath ceremony : ‘మోదీ అనే నేను..’- అట్టహాసంగా నరేంద్రుడి పట్టాభిషేకం!

Sharath Chitturi HT Telugu
Jun 09, 2024 07:28 PM IST

Modi oath ceremony live updates : దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ వేదికగా.. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార వేడుక అట్టహాసంగా జరిగింది. 8వేలకు పైగా మంది అతిథుల సమక్షంలో ప్రమాణం చేశారు మోదీ.

ప్రమాణస్వీకార మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ..
ప్రమాణస్వీకార మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ..

Modi oath ceremony live : భారత దేశ ప్రధానమంత్రిగా.. మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర దామోదర్​దాస్​ మోదీ. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​ వేదికగా ఆదివారం సాయంత్రం.. ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. వివిధ దేశాధినేతలు, దేశీయ రాజకీయ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాల సహా మొత్తం 8వేల మంది అతిథుల సమక్షంలో.. మోదీ చేత ప్రమాణస్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

అట్టహాసంగా.. ప్రమాణస్వీకార మహోత్సవం..

2024 లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. బీజేపీకి 240 సీట్లల్లో గెలుపు దక్కింది. ఫలితంగా.. ఎన్డీఏ కూటమి నేతల మద్దతుతో ప్రధాని బాధ్యతలను మరోమారు స్వీకరించారు నరేంద్ర మోదీ. జూన్​ 4న ఫలితాలు వెలువడగా.. ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణస్వీకార సమయంలో.. ‘మోదీ- మోదీ’ నినాదాలతో రాష్ట్రపతి భవన్​ ప్రాంగణం మారుమోగిపోయింది.

జవహర్​లాల్​ నెహ్రూ తర్వాత.. మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా.. భారత దేశ చరిత్రలో నిలిచిపోయారు మోదీ. 1952, 1957, 1962 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి.. పీఎం అయ్యారు నెహ్రూ. ఆ తర్వాత.. మోదీ తప్ప, మరే ఇతర వ్యక్తి కూడా.. వరుసగా మూడో ప్రధాని అవ్వలేదు.

మోదీతో పాటు పలువురు ఎంపీలు.. మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో టీడీపీ ఎంపీ రామ్మోహన్​ నాయుడు సైతం ఉన్నారు.

అతిథుల సమక్షంలో ప్రమాణం..

PM Modi latest news : మోదీ ప్రమాణ స్వీకారానికి.. బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా, నేపాల్​ ప్రధాని పుష్ప కమల్​ దహల్​, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్​ మైజుతో పాటు అనేక మంది దేశాల నేతలు హాజరయ్యారు.

బీజేపీ దిగ్గజ నేత మురళీ మనోహర్​ జోషీ కూడా ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు.

ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ నారా చంద్రబాబు నాయుడు, బిహార్​ సీఎం- జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ సైతం.. రాష్ట్రపతి భవన్​లో జరిగిన వేడుకలో పాల్గొన్నారు.

సతీసమేతంగా జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​, ఆయన సోదరుడు నాగబాబు సైతం ఈవెంట్​కి వెళ్లారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

“నేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాను. అందుకే.. ఈ ఈవెంట్​కి హాజరవుతున్నాను. ఇది రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత. ఒకవేళ మోదీ కలిస్తే.. శుభాకాంక్షలు చెబుతాను,” అని.. ఈవెంట్​కి ముందు మీడియాతో చెప్పారు మల్లిఖార్జున ఖర్గే.

ఇక.. గుజరాత్​, మణిపూర్​ సహా వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలు సైతం దిల్లీ రాష్ట్రపతి భవన్​లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు ఎన్డీఏ పక్ష నేతలు సైతం ఈవెంట్​కి హాజరయ్యారు.

కేరళలో అనాదిగా ఖాతా తెరవని బీజేపీకి తొలి విజయాన్ని అందించి, చరిత్ర సృష్టించిన సురేశ్​ గోపీ సైతం.. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.

ప్రముఖ పారిశ్రామికేవత్తలు ముకేశ్​ అంబానీ, గౌతమ్​ అదానీలు సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు.

సినీ ప్రముఖులు రాజనీకాంత్​, షారుక్​ ఖాన్​, అక్షయ్​ కుమార్​, విక్రమ్​ మాసే, రాజ్​కుమార్​ హిరాణీ, రవీణా ఠండన్​ తదితరులు సైతం.. మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్లారు.

సంబంధిత కథనం