Mizoram assembly elections : ‘మోదీకి.. మణిపూర్ కన్నా ఇజ్రాయెల్‌పైనే ధ్యాస ఎక్కువ!’
Rahul Gandhi in Mizoram : ప్రధాని మోదీ.. మణిపూర్ కన్నా ఇజ్రాయెల్‌పైనే ధ్యాస ఎక్కువ అని ఆరోపించారు రాహుల్ గాంధీ. మిజోరంలో జరిగిన ఎన్నికల ర్యాలీల ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi in Mizoram : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. మణిపూర్ కన్నా.. ఇజ్రాయెల్ గురించే ప్రధానికి ధ్యాస ఎక్కువ అని మండిపడ్డారు.
ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల మిజోరం పర్యటనలో భాగంగా.. సోమవారం ఉదయం 2.కి.మీల పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత.
"ఇజ్రాయెల్ (హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో)లో ఏం జరుగుతోంది? అన్న విషయంపై ప్రధాని, భారత ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మణిపూర్‌లో ఏం జరుగుతోందన్న విషయంపై మాత్రం వీరికి ఆసక్తి లేదు. ఇక్కడి ప్రజలు హత్యకు గురైనా, మహిళలపై అత్యాచారాలు జరిగినా, చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు," అని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi latest news : "ఇతరుల ఆలోచనలు, మతాలు, భాషల నుంచి నేర్చుకునే గొప్ప దేశం ఇండియా. కానీ బీజేపీ పాలనలో ఈ ఆలోచనలపై దాడి జరుగుతోందని," రాహుల్ గాంధీ అన్నారు.
"వివిధ సమాజాలు, మతాలు, భాషలపై వారు (బీజేపీ) దాడి చేస్తారు. విద్వేషాన్ని రెచ్చగొడతారు. దేశ నలుమూలల హింసకు పాల్పడతారు. ఇండియా ఆలోచనలకు వీరు వ్యతిరేకంగా ఉన్నారు," అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో గెలుపెవరిది..?
ఈశాన్య భారత దేశంలో భాగమైన మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 21. 2018లో జరిగిన ఎన్నికల్లో.. ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మొత్తం 26 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 చోట్లే ఖాతా తెరవగలిగింది.
Mizoram election schedule : ఇక ఇప్పుడు.. నవంబర్ 7న మిజోరం ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
మిజోరంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అవి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? విజయం సాధింస్తుందా? వంటి ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు తెలుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం