Adilabad Congress List: కాంగ్రెస్ తొలి జాబితాలో ముగ్గురికే దక్కిన చోటు
Adilabad Congress List: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురికి మాత్రమే చోటు లభించింది.
Adilabad Congress List: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా నిర్మల్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. బెల్లంపల్లి నియోజకవర్గానికి గడ్డం వినోద్, నిర్మల్ నియోజకవర్గం లో కూచాడి శ్రీహరి రావు, మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు ల పేర్లు ప్రకటించారు.
జిల్లాలో మిగతా ఏడు స్థానాలలో అభ్యర్థుల పేర్లు కారారు చేయలేదు. ఉమ్మడిదలాబాదులో ముందుగా ఊహించినట్టే టిక్కెట్లు ఆశించిన వారికి టికెట్లు దక్కాయి, దీంతో ఎక్కడ అసంతృప్తికి లోనుకు అవకాశం రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివాదాలకు దూరంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాలైన నిర్మల్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజవర్గాల్లో సీట్ల కేటాయింపు చేశారు. చోట్ల ఒక్కో నియోజకవర్గంలో నలుగురేసి అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీలో ఉన్నారు.
రెండో జాబితాపై ఎన్నో ఆశలు
మొదటి జాబితాలో ఆశావహులకే టికెట్లు వచ్చినప్పటికీ రెండో జాబితాలో టికెట్లు ఆశించే వారు ఎక్కువగా ఉన్నారు, మొదటి జాబితాలో కేవలం 3 నియోజకవర్గాలకు టికెట్లు డిక్లేర్ చేయగా, రెండో జాబితాలో మిగిలిన ఏడు నియోజకవర్గాలకు టికెట్లు కేటాయించాల్సి ఉంది.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, గండ్ర సుజాత లు ఆశిస్తుండగా గండ సుజాతకే మొగ్గు ఎక్కువ ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు, ఇదిలా ఉండగా బోత్ నియోజవర్గంలో వెన్నెల అశోక్ జాదవ్ నరేష్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
సిర్పూర్లో కృష్ణారెడ్డి, రావి శ్రీనివాస్ టికెట్ కోసం పోటీపడుతున్నారు, ముధోల్ నియోజకవర్గం లో ఆనందరావు పటేల్, కిరణ్ కుమార్, ఖానాపూర్ నియోజకవర్గం లో ఎడమ బొజ్జు, అజ్మీర శ్యాం నాయక్, ఆసిఫాబాద్ నియోజవర్గంలో మరుసకుల సరస్వతి, గణేష్, శ్యాం నాయక్ లో టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
చెన్నూరులో దుర్గం భాస్కర్ మొదటి నుంచి టికెట్ ఆశిస్తుండగా ఈ మధ్యనే పార్టీలో చేరిన నల్లాల ఓదెలు టికెట్ కోసం తీవ్ర ప్రయోజనాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సి డబ్ల్యూ సి టికెట్ ఆశించే వారిని మొదట మెప్పించిన తర్వాతనే చివరి జాబితా విడుదల చేయాలని బుజ్జగింపు కమిటీ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.
చివరి జాబితాలో టికెట్ రాకపోతే కాంగ్రెస్ కేడర్లో ఉన్న లీడర్లు వేరే పార్టీకి మారకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడిదలాబాద్ జిల్లాలో నూటికి నూరు శాతం గెలిచే అవకాశాలున్న స్థానాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, బోత్ , చెన్నూరు లలో అభ్యర్థులను వారి ఓటర్ల కనుగుణంగా ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.
గోండు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండే చోట్ల అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఖానాపూర్, సిర్పూర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లలో ఆదివాసి ఓట్లు కీలకంగా ఉన్నాయి, ఇక్కడ నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాయకులు చెబుతున్నారు.
రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, అదిలాబాద్