తెలుగు న్యూస్  /  National International  /  Face Cbi On March 25 In Delhi ',Wont Be Arrested' Delhi Hc Tells Tejashwi Yadav

Tejashwi Yadav: ‘‘అరెస్ట్ చేయరు.. విచారణకు హాజరు కండి’’

HT Telugu Desk HT Telugu

16 March 2023, 15:25 IST

  • Tejashwi Yadav: ‘ల్యాండ్ ఫర్ జాబ్ (land for job)’ స్కామ్ లో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు ఢిల్లీ హై కోర్టులో ఊరట లభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ల్యాండ్ ఫర్ జాబ్ (land for job) స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల్లో ఒకరైన బిహార్ డెప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు గురువారం ఢిల్లీ హై కోర్టు (Delhi high court) లో ఊరట లభించింది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Tejashwi Yadav: అరెస్ట్ చేయరు..

ల్యాండ్ ఫర్ జాబ్ (land for job) అవినీతి కుంభకోణంలో మార్చి 25న సీబీఐ ముందు విచారణకు హాజరుకావాలని ఢిల్లీ హై కోర్టు (Delhi high court) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కు సూచించింది. విచారణ సందర్భంగా తేజస్వీ యాదవ్ ను సీబీఐ అరెస్ట్ చేయబోదని హామీ ఇచ్చింది. అంతకుముందు, తేజస్వీ యాదవ్ ను అరెస్ట్ చేయబోవడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది నుంచి కోర్టు హామీ తీసుకుంది.

CBI summons Tejashwi Yadav: మార్చి 25న..

మార్చి 25న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు బిహార్ డెప్యూటీ సీఎం, ఆర్జేడీ అగ్ర నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) వ్యవక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని, అయితే, ఆ సమయంలో ఆయనను సీబీఐ అరెస్ట్ చేయబోదని సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. దాంతో, మార్చి 25న తేజస్వీ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు అవుతారని తేజస్వీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ, తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) హై కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీలో లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని, అవి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగుతాయని, బిహార్ ఉప ముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్ ఏప్రిల్ 5 తరువాత మాత్రమే సీబీఐ విచారణకు హాజరు కాగలరని తేజస్వీ తరఫు న్యాాయవాది మనీందర్ సింగ్ ఢిల్లీ హై కోర్టు (Delhi high court) కు విన్నవించారు. ఈ లోపు అవసరమైతే, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు తన క్లయింట్ తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల తేజస్వీ నివాసంలో ఈడీ (Enforcement Directorate ED) జరిపిన సోదాల కారణంగా గర్భిణిగా ఉన్న తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) భార్య ఒత్తిడికి లోనై, అనారోగ్యం పాలయ్యారని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

land for job case: ఏంటీ ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్

యూపీఏ 1 హయాంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాల భర్తీలో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. అభ్యర్థుల నుంచి చవకగా, నామమాత్రపు ధరకు వారి భూమిని కొనుక్కొని వారికి రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారన్నది (land for job) లాలు యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై ప్రధాన ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి లాలు ప్రసాద్ యాదవ్, మరో 14 మందిపై సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసింది.

టాపిక్