Land for Jobs Case: లాలూ ప్రసాద్ యాదవ్‍ను ప్రశ్నిస్తున్న సీబీఐ: ‘లాలూ కూతురు వార్నింగ్’-land for job scam cbi questioning lalu prasad yadav ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Land For Job Scam Cbi Questioning Lalu Prasad Yadav

Land for Jobs Case: లాలూ ప్రసాద్ యాదవ్‍ను ప్రశ్నిస్తున్న సీబీఐ: ‘లాలూ కూతురు వార్నింగ్’

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 07, 2023 01:36 PM IST

Land for Jobs Case - Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‍ను సీబీఐ నేడు ప్రశ్నిస్తోంది. ఈ తరుణంలో లాలూ రెండో కూతురు సీబీఐను హెచ్చరించారు.

Land for Jobs Case: లాలూ ప్రసాద్ యాదవ్‍ను ప్రశ్నిస్తున్న సీబీఐ
Land for Jobs Case: లాలూ ప్రసాద్ యాదవ్‍ను ప్రశ్నిస్తున్న సీబీఐ (PTI)

Land for Jobs Case - Lalu Prasad Yadav: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్‍ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నేడు (మార్చి 7, మంగళవారం) విచారిస్తోంది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. లాలూ సతీమణి, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ(Rabri Devi)ని సీబీఐ.. సోమవారం విచారించింది. నేడు ఢిల్లీలోని లాలూ కూతురు మిసా భారతీ ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అక్కడే లాలూను విచారిస్తున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కూతుళ్లు మిసా, హేమ సహా మరికొందరు ఉన్నారు. విచారణ సందర్భంగా లాలూ కూతురు రోహిణి.. సీబీఐకి వార్నింగ్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

ఏంటి ఈ కేసు!

Land for Jobs Case: 2004 నుంచి 2009 మధ్య రైల్వే శాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పని చేశారు. ఆ సమయంలో ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబ సభ్యులు చౌక ధరలకు భూములు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే ఉద్యోగాలు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా వారి భూములను తక్కువ ధరకే తీసుకున్నారనేది ఆరోపణ. దీనిపైనే ల్యాండ్ ఫర్ జాబ్ కేసును సీబీఐ నమోదు చేసింది. విచారణ చేస్తోంది.

Land for Jobs Case - Lalu Prasad Yadav: 2022 మేలో ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. లాలూ, ఆయన భార్య, కూతుళ్లతో పాటు ఉద్యోగాలు పొందిన 12 మంది పేర్లు కూడా దీంట్లో ఉన్నాయి. లాలూ యాదవ్ అనుచరుడు, మాజీ ఓఎస్‍డీ భోలా యాదవ్‍ను ఈ కేసులో సీబీఐ గతేడాది అరెస్ట్ చేసింది.

సీబీఐకు లాలూ కూతురు హెచ్చరిక

Land for Jobs Case - Lalu Prasad Yadav: 74 ఏళ్ల తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‍ను సీబీఐ వేధిస్తూనే ఉందని ఆయన రెండో కూతురు రోహిణి ఆచార్య ఆరోపించారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరినీ వదిలిపెట్టబోనని ఆమె సీబీఐను హెచ్చరిస్తూ ట్వీట్లు చేశారు.

తన తండ్రిని సీబీఐ వేధిస్తున్న తీరు సరికాదని రోహిణి పేర్కొన్నారు. “ఇవన్నీ గుర్తుంటాయి. సమయం చాలా శక్తివంతమైనది” అని హిందీలో రోహిణి ట్వీట్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికీ ఢిల్లీలో అధికార పీఠాన్ని కదిలించగరలని ఆమె అభిప్రాయపడ్డారు. సహనానికి ఉన్న పరిమితులను పరీక్షిస్తున్నారంటూ ఆమె మరో ట్వీట్ చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం