తెలుగు న్యూస్  /  National International  /  Delhi Murder Tattoo Break Up Drove Sahil To Kill Girl Check Details

Delhi Murder: ‘బ్రేకప్, టాటూ!’: 16ఏళ్ల యువతిని బాయ్‍ఫ్రెండ్ హత్య చేసిన కేసులో కీలక విషయాలు

30 May 2023, 10:33 IST

    • Delhi Murder: ఢిల్లీలో 16ఏళ్ల అమ్మాయి హత్య కేసులో కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాయ్‍ఫ్రెండ్ ఆమెను చంపేందుకు దారి తీసిన విషయాలు ఏంటో కొన్ని వెల్లడయ్యాయి.
హత్య కేసులో నిందితుడు సాహిల్‍ను పట్టుకున్న పోలీసులు (ANI Photo)
హత్య కేసులో నిందితుడు సాహిల్‍ను పట్టుకున్న పోలీసులు (ANI Photo)

హత్య కేసులో నిందితుడు సాహిల్‍ను పట్టుకున్న పోలీసులు (ANI Photo)

Delhi Murder: దేశరాజధాని ఢిల్లీలోని షహ్‍బాద్ డెయిరీ ప్రాంతంలో జరిగిన 16 ఏళ్ల అమ్మాయి దారుణ హత్య సంచలనంగా మారింది. బాయ్‍ఫ్రెండ్ అయిన 20 ఏళ్ల సాహిల్ ఆమెను కత్తిలో పలుమార్లు పొడిచి.. బండరాయితో బాది కిరాకతకంగా నడివీధిలో చంపాడు. పరారైన సాహిల్‍ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఈ హత్య కేసును విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్యకు దారి తీసిన విషయాలు బయటికి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

2021 నుంచి సాహిల్‍కు, ఆ అమ్మాయికి మధ్య రిలేషన్ ఉందని పోలీసుల విచారణలో తేలింది. అయితే, తరచూ గొడవలు జరుగుతుండటం, రిలేషన్ ప్రమాదకరంగా మారుతుండటంతో కొంతకాలంగా సాహిల్‍ను ఆ అమ్మాయి దూరం పెడుతూ వచ్చింది. అతడితో మాట్లాడడం మానేసింది. బ్రేకప్ చేసుకుందామని స్పష్టంగా చెప్పింది. అయినా సాహిల్ ఆమెను వేధించాడు. మళ్లీ కలిసిపోదామంటూ వెంటపడ్డాడు. ఈ వాదనల్లోనే ఆదివారం రాత్రి ఈ కిరాతకానికి సాహిల్ పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.

“శనివారం కూడా వారి మధ్య రిలేషన్ గురించి తీవ్రమైన వాదన జరిగింది. హత్యకు ఈ విషయం కూడా దారితీసి ఉండొచ్చు” అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.

కాగా, ఆ అమ్మాయి చేతిపై ప్రవీణ్ అనే పేరు టాటూ ఉండడంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. ఆమెకు, సాహిల్‍కు మధ్య గొడవలకు జరిగేందుకు ఈ టాటూ కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఫోన్ కాల్‍తో పట్టుబడిన నిందితుడు

అమ్మాయిని ఆదివారం కిరాతకంగా హత్య చేసిన తర్వాత సాహిల్.. ఉత్తర ప్రదేశ్‍లోని బులందర్ షహర్‌లో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే పోలీసులు అతడి ఫోన్‍పై నిఘా ఉంటారు. హత్య చేసిన తర్వాత ఫోన్‍ను స్విచ్ఛాప్ చేసిన అతడు.. కొన్ని గంటల తర్వాత ఆన్ చేసి తన తండ్రికి కాల్ చేశాడు. దీంతో పోలీసులు సాహిల్ లొకేషన్‍ను ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నాడు. బులందర్ షెహర్‌లో సాహిల్‍ను అరెస్టు చేసి.. ఢిల్లీకి తీసుకొచ్చారు. ఏసీ, రిఫ్రిజిరేటర్ల మెకానిక్‍గా సాహిల్ పని చేస్తున్నాడు.

మరోవైపు ఇది లవ్ జిహాద్ కేసు అని కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీలోని షహ్‍బాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం రాత్రి 16 ఏళ్ల అమ్మాయిని సాహిల్ అత్యంత కిరాతకంగా చంపాడు. కత్తితో పలుమార్లు పొడవడమే కాకుండా.. పెద్ద బండరాయితో కొట్టాడు. ఆ సమయంలో కొందరు స్థానికులు అక్కడే ఉన్నా.. అతడిని కనీసం ఆపలేదు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ అమ్మాయి శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నాయని, పుర్రె తీవ్రంగా దెబ్బతినిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.