తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid-19 Cases In Us Surpass 100 Million: 10 కోట్లు దాటిన కరోనా కేసుల సంఖ్య

Covid-19 cases in US surpass 100 million: 10 కోట్లు దాటిన కరోనా కేసుల సంఖ్య

HT Telugu Desk HT Telugu

22 December 2022, 15:29 IST

  • Surge in Covid cases: పలు దేశాల్లో కరోనా(corona) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో, మిగతా దేశాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. భారత్ కూడా కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాల్సిందిగా ప్రజలను కోరింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Surge in Covid cases: చైనాతో పాటు అమెరికా, బ్రెజిల్, జపాన్, దక్షిణ కొరియాల్లో కరోనా(corona) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధానంగా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని నిర్ధారించారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Covid-19 cases in US surpass 100 million: అమెరికాలో పది కోట్లు

ఇటీవల పెరిగిన కేసుల సంఖ్య కారణంగా అమెరికాలో కరోనా(corona) కేసుల సంఖ్య 10 కోట్లు దాటిందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.2020 మార్చ్ లో కరోనా ప్రారంభమైన నాటి నుంచి అమెరికా నమోదైన కరోనా కేసుల సంఖ్య 10 కోట్లు దాటిందని వెల్లడించింది. గురువారం నాటికి అమెరికాలో కరోనా(corona) సోకిన వారి సంఖ్య 10,00,03,837 అని తెలిపింది. ముఖ్యంగా మొదటి, రెండో వేవ్ ల సమయంలో అమెరికాలో భారీగా కరోనా(corona) కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటివరకు అమెరికాలో 10.88 లక్షల మంది కోవిడ్ 19 (Covid-19) కారణంగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.

70% vaccination: 70% వ్యాక్సినేషన్ లక్ష్యం నెరవేరలేదు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 (Covid-19) కారణంగా వారానికి 8 వేల నుంచి 10 వేల మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ లో కోవిడ్ 19 (Covid-19) రెస్పాన్స్ టీమ్ టెక్నికల్ హెడ్ మారియా వేన్ ఖర్కెవ్ వెల్లడించారు. ప్రతీ దేశంలో కనీసం 70% ప్రజలు టీకా తీసుకుని ఉండాలన్న లక్ష్యం నెరవేరలేదన్నారు. కోవిడ్ (Covid-19) ను నిర్మూలించడానికి టీకా తీసుకోవడం ఒక్కటే సరైన మార్గమన్నారు. ప్రస్తుతం చైనా లో కరోనా(corona) కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం ఒమిక్రాన్ వేరియంట్లైన బీఏ 5.2(BA.5.2), బీఎఫ్ 7(BF.7.) అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టాపిక్