Omicron : ఏడాది కాలంలో- 500 సబ్వేరియంట్లు.. ఇదీ ఒమిక్రాన్ చరిత్ర!
Omicron new variant : ఒమిక్రాన్ పుట్టుకొచ్చి ఏడాది గడిచిపోయింది. ఈ వ్యవధిలో.. 500కుపైగా ఒమిక్రాన్ సబ్వేరియంట్లు పుట్టుకొచ్చాయి!
Omicron new variant : ఒమిక్రాన్.. 2021 నవంబర్ 26న ఈ కొవిడ్ వేరియంట్‌ను గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). డెల్టా వేరియంట్ సృష్టించిన అల్లకల్లోలం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే.. ఈ కొత్త వేరియంట్ పుట్టుకురావడం సర్వత్రా భయాందోళనలు రేకెత్తించింది. హాంగ్‌కాంగ్, దక్షిణాఫ్రికా, బోట్స్వానా తదితర ప్రాంతాల్లో ఒమిక్రాన్‌పై విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ వేరియంట్లో ఎన్నో మ్యుటేషన్లు దాగి ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు.. ప్రపంచానికి హెచ్చరికలు పంపించారు. ఇవి రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు.
రంగంలోకి దిగిన డబ్ల్యూహెచ్ఓ.. ఒమిక్రాన్‌పై పూర్తిస్థాయి పరిశోధనలు చేపట్టింది. 'ఈ వేరియంట్.. చాలా కొత్తగా, ఇతర వాటితో పోల్చితే చాలా భిన్నంగా ఉంది. దీని కోసం ప్రపంచం దేశాలు చాలా త్వరగా సన్నద్ధమవ్వాలి. ప్రజలు మాస్కులు ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలోనూ అజాగ్రత్తగా వహించకండి.. ప్రాణాల మీదకు తెచ్చుకోకండి,' అని స్పష్టం చేసింది.
Omicron sub variants : అంతే.. నాలుగు వారాల్లో.. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని చుట్టేసింది. డెల్టా స్థానాన్ని భర్తీ చేస్తూ.. ప్రపంచ దేశాలను భయపెట్టింది. ఇండియాలో.. ఈ ఏడాది జనవరిలో వచ్చిన మూడో వేవ్‌కు కారణంగా నిలిచింది ఈ ఒమిక్రాన్. ఈ సమయంలోనే డెల్టా కన్నా దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్యులు గుర్తించారు.
ఏడాది కాలంలో.. 500 సబ్వేరియంట్లు..!
ఒమిక్రాన్ పుట్టుకొచ్చి ఏడాది కాలం గడిచిపోయింది. ఇప్పుడు లెక్కలేసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌కు చెందిన 500 సబ్వేరియంట్లు ఉన్నాయి! అయితే.. వీటిల్లో ఒక్కదాన్ని కూడ 'వేరియంట్ ఆఫ్ కన్సర్న్'గా గుర్తించలేదు.
ఒమిక్రాన్ సబ్వేరియంట్ల ప్రభావం ఎంతంటే..
India covid cases : ఇప్పటివరకు పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్వేరియంట్లలో ఒక విషయం కీలకంగా ఉంది. ఇవన్నీ అత్యంత వేగంగా వ్యాపించే వైరస్‌లే. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను ఓడించే శక్తి వీటికి ఉంది. అయితే.. ఇతర వేరియంట్లతో పోల్చితే.. ఒమిక్రాన్ సబ్వేరియంట్లు అంత ప్రమాదకరంగా లేవు.
అందుకే.. 500 సబ్వేరియంట్లు ఉన్నా.. ఒమిక్రాన్ పెద్దగా భయపెట్టడం లేదు.
టీకాలు ఉన్నాయి.. కానీ!
Omicron cases in world : ఒమిక్రాన్ తీవ్రతను టీకాలు తగ్గించాయి అన్నది వాస్తవమే. కానీ టీకాల ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతూ కనిపించింది. అదే సమయంలో.. హాస్పిటలైజేషన్, మరణం నుంచి రక్షణ మాత్రం టీకాల ద్వారా వస్తోంది. అందుకే లక్షలాది మంది.. మరణం నుంచి బయటపడ్డారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.
సంబంధిత కథనం