India Covid Vaccination : శభాష్​ ఇండియా.. వ్యాక్సినేషన్​ @200కోట్లు!-india covid vaccination drive reaches 200 crore milestone ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Covid Vaccination : శభాష్​ ఇండియా.. వ్యాక్సినేషన్​ @200కోట్లు!

India Covid Vaccination : శభాష్​ ఇండియా.. వ్యాక్సినేషన్​ @200కోట్లు!

Sharath Chitturi HT Telugu
Jul 17, 2022 02:25 PM IST

India Covid Vaccination drive : ఇండియా @200కోట్లు..! 2021 జనవరిలో కొవిడ్​ వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను మొదలుపెట్టిన ఇండియా.. ఆదివారంతో 200కోట్ల మార్క్​ను అందుకుంది.

<p>శభాష్​ ఇండియా.. వ్యాక్సినేషన్​ @200కోట్లు!</p>
శభాష్​ ఇండియా.. వ్యాక్సినేషన్​ @200కోట్లు! (Dinesh Gupta)

India Covid Vaccination drive : కొవిడ్​ 19పై యుద్ధంలో భారత దేశం దూసుకెళుతోంది. తాజాగా.. టీకా పంపిణీ ప్రక్రియలో సరికొత్త మైలురాయిని అందుకుంది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200కోట్ల(2బిలియన్​) వ్యాక్సిన్లను పంపిణీ జరిగింది.

కొవిడ్​పై యుద్ధంలో భాగంగా 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రారంభమైంది. శనివారం నాటికి 199.97కోట్ల కొవిడ్​ టీకాల పంపిణీ జరిగింది. ఆదివారం 200కోట్ల మైలురాయి దాటింది. ఇదే కాకుండా.. ఇప్పటివరకు 5.48కోట్ల ప్రికాషనరీ డోసులు కూడా పంపిణీ చేశారు.

200కోట్ల కొవిడ్​ టీకాల మార్క్​ను ఇండియా అందుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు.

"ఇండియా చరిత్ర సృష్టించింది. 200కోట్ల టీకాలు సరఫరా చేసిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. శరవేగంగా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను నిర్వహిస్తున్న వారందరిని చూస్తే గర్వంగా ఉంది. అంతర్జాతీయంగా కొవిడ్​పై సాగుతున్న యుద్ధాన్ని భారత దేశం మరింత బలపరిచింది," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​లో పేర్కొన్నారు.

కొవిడ్​ వ్యాక్సినేషన్​ డ్రైవ్​..

  • కొవిన్​ ప్రకారం.. దేశవ్యాప్తంగా 14వేల టీకా కేంద్రాలు ఉన్నాయి.
  • వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను మొదలుపెట్టిన 277రోజులకు 100కోట్ల మైలురాయిని అందుకుంది ఇండియా. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. గతేడాది సెప్టెంబర్​ 17న.. ఒక్కరోజే 2.5కోట్లమందికి టీకా పంపిణీ చేశారు. ఇదొక రికార్డు!
  • 200 crore vaccination : కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. దేశంలోని 98మంది వయోజన జనాభా.. కనీసం ఒక్క డోసు టీకా తీసుకుంది. 90శాతం జనాభా పూర్తిగా టీకాలు పొందింది.
  • గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాక్సిన్​ కేంద్రాల్లోనే 71శాతం టీకాల పంపిణీ జరిగింది. పట్టణ ప్రాంతాల్లో అది 29శాతంగా ఉంది. టీకా రెండు డోసులు పొందిన మహిళలు 48.9శాతం. పురుషుల్లో అది 51.5శాతంగా ఉంది.
  • టీకా రెండో డోసుకు.. ప్రికాషనరీ డోసుకు తొలుత.. 9నెలల వ్యవధిని పెట్టిన కేంద్రం.. గత వారం ఆ వ్యవధిని తొమ్మిది నుంచి 6నెలలకు మార్చింది.
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,449 కొవిడ్​ యాక్టివ్​ కేసులు ఉన్నాయి. భారత్​లో ఇప్పటివరకు వెలుగు చూసిన కొవిడ్​ కేసుల్లో ఇది 0.33శాతం.

Whats_app_banner

సంబంధిత కథనం