Covid Booster Dose: ఇక 6 నెలలే… బూస్టర్ డోస్ వ్యవధిపై కేంద్రం కీలక నిర్ణయం
బూస్టర్ డోసు వ్యవధిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) ప్రభుత్వానికి కీలక సిఫార్సు చేసింది. 9 నెలలుగా ఉన్న సమయాన్ని 6 నెలలకు తగ్గించాలని సూచించింది.
centre reduces gap between booster doses: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య గ్యాప్‌ను తగ్గించేందుకు సిద్ధమైంది. డోసుల మధ్య గ్యాప్‌ను 6 నెలలకు తగ్గించింది. సెకండ్ డోస్, బూస్టర్ డోస్ మధ్య వ్యవధిని తగ్గించాలని కేంద్రానికి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (National Technical Advisory Group on Immunisation) సూచించింది. ఈ మేరకు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రాలకు కేంద్రం లేఖ...
ప్రస్తుతం బూస్టర్ డోస్‌కు, సెకండ్ డోస్‌కు మధ్య 9 నెలల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను తాజాగా 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, 18-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు.. సెకండ్ డోస్ తీసుకున్న ఆరు నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ ద్వారా తెలిపారు.
కొవిడ్ ఉద్ధృతి తగ్గిందని భావించిన కేంద్రం... మే నెలలో పలు నిబంధనలు సడలించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టే పనిలో పడింది.
Covid Cases in India: మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 16,159 మంది వైరస్ బారినపడగా.. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు పైగా పెరిగింది. కొవిడ్ నుంచి 15,394 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.56శాతానికి పెరిగింది. దేశంలో సోమవారం 9,95,810 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,20,86,763కు చేరింది. మరో 4,54,465 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
టాపిక్