తెలుగు న్యూస్  /  National International  /  Bride Touches His Wife Feet In Wedding Ceremony

Virial Video: వధువు కాళ్లు పట్టుకున్న వరుడు.. అవాక్కైన పెళ్లికూతురు

Vijaya Madhuri HT Telugu

23 February 2022, 18:58 IST

  • ఓ చోట వరమాల కార్యక్రమం జరుగుతుంది. చుట్టూ బంధువులు, స్నేహితుల కేరింతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సందడిలోనే వధువు.. భర్త మెడలో వరమాలను వేసి.. కాళ్లు మొక్కింది. అనంతరం వరుడు కూడా వధువు మెడలో మాల వేశాడు. వెంటనే ఆమె కాళ్లు మొక్కాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్​కు గురయ్యారు.

పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కిన వరుడు
పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కిన వరుడు

పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కిన వరుడు

Virial Video: భార్య భర్తలు ఇద్దరు సమానమే అని చాటి చెప్పేలా ఉంది ఈ ఘటన. పెళ్లి జరుగుతున్న సమయంలో వరుడు చేసిన పని చుట్టూ ఉన్న వాళ్లని షాక్​కు గురయ్యేలా చేసింది. సాధారణంగా ఏ వివాహ వేడుకలో అయినా పెళ్లి తంతులో భాగంగా వధువు.. వరుడు కాళ్లు పట్టుకుంటుంది. అది సాంప్రదాయం కూడా. అనాదిగా ఈ ఆచారం వస్తూనే ఉంది. ఓ యువకుడు మాత్రం ఎప్పుడు అమ్మాయిలే కాళ్లు పట్టుకోవాలా మగవాళ్లు మొక్కకూడదా అనుకున్నాడో ఏమో.. వరమాల జరుగుతున్నప్పుడు వధువు కాళ్లను మొక్కేశాడు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

వరమాల వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కప్తాన్ హిందూస్థాన్ ట్విటర్ హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోలో వరుడు తన భార్య పాదాలను మొక్కిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో సారాంశం

వరమాల కార్యక్రమంలో భాగంగా వధువు వరుడి మెడలో మాల వేసి కాళ్లు మొక్కింది. వెంటనే వరుడు కూడా అమ్మాయి మెడలో మాల వేసి కాళ్లు మొక్కాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు పెళ్లి కూతురు సహా.. చుట్టూ ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు.

ప్రశంసలు.. ఫన్నీ కామెంట్లు

ఇదిలా ఉండగా.. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశసంల వర్షం కురిపించగా.. మరికొందరు సెటైరికల్ గా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మంచి పని చేశావు. అమ్మాయిని గౌరవించావు అంటూ కొందరు ప్రశంసించారు. మరికొందరు మాత్రం అబ్బాయి ఫెమినిస్ట్ అయి ఉంటాడు. అందుకే అమ్మాయి కాళ్లు పట్టుకున్నాడని ఒకరు కామెంట్ చేయగా.. పెళ్లి తర్వాత తనను ఎలాంటి టార్చర్ పెట్టొద్దు అని, ఇబ్బందులకు గురిచేయొద్దని వేడుకుంటున్నాడంటూ మరికొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా పెళ్లి తంతులో అబ్బాయి వధువు కాళ్లు మొక్కడమనేది మెచ్చుకోదగిన విషయమేనని ఫెమినిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.