తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Updates: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు (ANI)

Live News Updates: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03 May 2023, 22:03 IST

  • Breaking News Live Updates Today: నేటి జాతీయ, అంతర్జాతీయ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, స్థానిక, వ్యాపార వార్తలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో చూడండి. తాజా సమాచారం కోసం ఈ పేజీని ఫాలో అవండి.

03 May 2023, 22:03 IST

Priyanka Gandhi in Karnataka: ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు..

ప్రజల్లో సానుభూతి సంపాదించి, తద్వారా ఓట్లను పొందడం కోసం ఏడుపు నటిస్తూ ఓటర్ల వద్దకు వస్తున్నారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) వ్యంగ్య విమర్శలు చేశారు. కర్నాటకలోని మాండ్య జిల్లాలోని హోస్కోటెలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (karnataka elections) లో బుధవారం ఆమె పాల్గొన్నారు.

03 May 2023, 21:24 IST

Titan Q4 Results: టైటన్ ఫైనల్ డివిడెండ్ ఎంతో తెలుసా?

Titan Q4 Results:2022 -23 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికం (Q4FY23) ఫలితాలను టైటన్ కంపెనీ బుధవారం వెలువరించింది. ఈ Q4 లో రూ. 734 కోట్ల నికర లాభాలను టైటన్ సముపార్జించింది.

03 May 2023, 18:16 IST

Go First bankruptcy: ‘గో ఫస్ట్’ ఎయిర్ లైన్స్ దివాళా; పతనం అంచున మరో ఎయిర్ లైన్స్

ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని, భారీగా ఉన్న రుణాలను తీర్చలేని స్థితిలో ఉన్నామని పేర్కొంటూ గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ (Go First airlines) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (National Company Law Tribunal (NCLT) కు దరఖాస్తు చేసుకుంది.

03 May 2023, 17:18 IST

1.2 cr compensation: యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 1.2 కోట్ల పరిహారం

1.2 cr compensation: నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక కుటుంబ యజమాని మరణానికి కారణమైన వారు మృతుడి కుటుంబానికి రూ. 1.19 కోట్ల పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర కోర్టు తీర్పునిచ్చింది.

03 May 2023, 16:47 IST

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఎనిమిది రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రోల పతనం ఈక్విటీల బలహీన ధోరణికి తోడైంది. సెన్సెక్స్ 161.41 పాయింట్లు క్షీణించి 61,193.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.80 పాయింట్లు పడిపోయి 18,089.85 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ నుంచి భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, నెస్లే షేర్లు లాభపడ్డాయి.

03 May 2023, 15:42 IST

సమ్మక్క సారక్క 2024 మహా జాతర తేదీలు ఇవే

వనదేవతలు సమ్మక్క సారక్క 2024మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. బుధవారం నాటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

21.02.2024 బుధవారం రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు

22.02.2024 గురువారం రోజున సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు

23.02.2024 శుక్రవారం రోజున భక్తులు మొక్కులు తీర్చుకుంటారు

24.02.2024 శనివారం రోజున దేవతల వనప్రవేశం

28.02.2024 బుధవారం తిరుగువారం జాతర పూజలు ముగింపు.

03 May 2023, 15:27 IST

Same sex marriages: ‘LGBTQIA సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తాం’ - కేంద్రం

Same sex marriages: ఎల్జీబీటీక్యూఐఏ (LGBTQIA) కమ్యూనిటీ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించడానికి కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. స్వలింగ వివాహాలకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయం వెల్లడించింది.

03 May 2023, 15:22 IST

పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 9 మంది మృతి

బుధవారం ఉదయం సెర్బియాలోని బెల్‌గ్రేడ్ ప్రాథమిక పాఠశాలలో ఒక బాలుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది వ్యక్తులు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని ఒక సోర్స్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ తంజుగ్ నివేదించింది. 

03 May 2023, 14:50 IST

విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన

విశాఖపట్నంలో 300 మెగావాట్ల డేటాసెంటర్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్‌ ఏర్పాటులో భాగంగా సింగపూర్‌ నుంచి సబ్‌మెరైన్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తారని సీఎం చెప్పారు. ఇది విశాఖ అభివృద్ధిని మరింత పెంచుతుందని వివరించారు. ఈ తరహా ఆధునిక సదుపాయాల వల్ల విశాఖ నగరం మహానగరంగా ఎదగడానికి దోహదపడుతుందని చెప్పారు. 39 వేల మందికి ఉపాధి కలుగుతుందని, రూ. 21,800 కోట్ల పెట్టుబడి విశాఖకు వస్తుందని వివరించారు. 190 ఎకరాల భూమిని కేటాయించినట్టు చెప్పారు. డేటా సెంటర్‌ పార్కుతోపాటు ఐటీ సెంటర్‌ పార్కు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సదుపాయం, రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటవుతాయని వివరించారు. విశాఖలోని డేటా సెంటర్‌ దేశంలోనే అతి పెద్దది కానుందని చెప్పారు.

03 May 2023, 14:48 IST

రేపు, ఎల్లుండి గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఎల్లుండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.

03 May 2023, 14:47 IST

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్ విచారణకు హాజరయ్యారు. వీరు ఇద్దరిని కలిపి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్య రోజు లేఖ దాచి పెట్టడంపై ప్రకాశ్‌ను సీబీఐ ప్రశ్నించినట్టు సమాచారం. నిన్న పీఏ కృష్ణారెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఇవాళ మరోసారి కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను విచారిస్తున్నారు. 

03 May 2023, 14:22 IST

‘ఫోన్‍పే’లోనూ యూపీఐ లైట్ సదుపాయం

UPI Lite: పాపులర్ డిజిటల్ పేమెంట్స్ యాప్ “ఫోన్‍పే (PhonePe)”లో కూడా యూపీఐ లైట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూపీఐ లైట్ ద్వారా యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే రూ.200లోపు పేమెంట్‍లను చేయవచ్చు. ఇప్పటికే పేటీఎంలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

03 May 2023, 13:57 IST

మరో మూడు రోజులు వర్షాలు

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ద్రోణి కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

03 May 2023, 13:35 IST

హీరో విక్రమ్‍కు తీవ్ర గాయం

తమిళ ప్రముఖ నటుడు, హీరో చియాన్ విక్రమ్‍ గాయపడ్డారు. తంగళాన్ సినిమా కోసం యాక్షన్స్ సీన్స్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఆయన పక్కటెముకకు గాయం అయింది. చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారు. 

03 May 2023, 13:11 IST

SSC CGL 2023: దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ

ఎస్‍ఎస్‍సీ సీజీఎల్ 2023 పోస్టులకు దరఖాస్తు చేసేందుకు నేడే (మే 3) ఆఖరు తేదీగా ఉంది. ssc.nic.in వెబ్‍సైట్‍లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

03 May 2023, 12:51 IST

జూలైలో టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ లాంచ్!

2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది జూలైలో లాంచ్ కానుందని సమాచారం బయటికి వచ్చింది. ప్రస్తుత నెక్సాన్‍తో పోలిస్తే చాలా అప్‍గ్రేడ్‍లతో ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

03 May 2023, 14:03 IST

రెజ్లర్లను కలిసిన పీటీ ఉష

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న భారత టాప్ రెజర్లను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పీటీ ఉష కలిశారు. వారితో మాట్లాడి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 11 రోజులుగా రెజర్లు ఆందోళన చేస్తున్నారు. 

03 May 2023, 12:01 IST

ఏపీలో నేడు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‍లో నేడు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది. 

03 May 2023, 11:39 IST

అతిత్వరలో నీట్ అడ్మిట్ కార్డుల విడుదల

NEET 2023 Admit Cards: నీట్ యూజీ 2023 అడ్మిట్ కార్డులను ఎన్‍టీఏ అతిత్వరలో విడుదల చేయనుంది. నేడు లేకపోతే రేపు అడ్మిట్ కార్డులు వెల్లడవుతాయని అంచనాలు ఉన్నాయి. నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాక neet.nta.nic.in వెబ్‍సైట్‍ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 7న నీట్ యూజీ 2023 పరీక్ష జరగనుంది. 

03 May 2023, 12:01 IST

నేడు ఢిల్లీకి  సీఎం కేసీఆర్

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ నేడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు (మే 4) ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. 

03 May 2023, 11:00 IST

కేంద్ర క్రీడాశాఖ మంత్రిపై రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపణలు

లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‍పై చర్యలు తీసుకోవాలని భారత టాప్ రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కమిటీ వేసి.. సమస్యను అణిచివేసేందుకు ఆయన చూశారని, అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా, బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని జనవరిలోనూ కొంతకాలం రెజ్లర్లు ఆందోళన చేశారు. అయితే కేంద్రం విచారణ కమిటీని నియమించటంతో ఆందోళన విరమించారు. అయితే, ఎలాంటి చర్యలు లేకపోవటంతో ఇప్పుడు మరోసారి నిరసనకు దిగారు. 

03 May 2023, 10:14 IST

ముంబై హైకోర్టు జడ్జి పోస్టుకు ఫిర్దోష్ పేరు సిఫారసు

ముంబై హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు అడ్వకేట్ ఫిర్దోష్ ఫిరోజ్ పూనివాలా పేరును సుప్రీం కొలిజియమ్ సిఫారసు చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో అభ్యంతరాలను తోసిపుచ్చి.. ఆయనకు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వానికి రెకమెండ్ చేసింది. 2020లో ఫిర్దోష్ రాసిన ఓ ఆర్టికల్ పట్ల ఐబీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 

03 May 2023, 9:47 IST

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ నెల 5వతేదీ వరకు కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు.    

03 May 2023, 9:22 IST

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఓపెనింగ్ సెషన్‍లో నిఫ్టీ 65.35 పాయింట్లు పడిపోయి 18,082.30 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 204.37 పాయింట్లు నష్టపోయి 61,150.34 వద్ద ట్రేడవుతున్నాయి.

03 May 2023, 8:57 IST

బయలుదేరిన ‘ఆపరేషన్ కావేరి’ 12వ విమానం

ఘర్షణలతో కల్లోలంగా మారిన సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ‘ఆపరేషన్ కావేరి’ చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సౌదీ అరేబియా నుంచి భారత్‍కు 12వ విమానం బయలుదేరింది. ఈ విమానంలో 231 మంది భారతీయులు ఉన్నాడు. భారతీయులను సూడన్ నుంచి జెడాకు తరలించి.. అక్కడి నుంచి ఇండియాకు తీసుకొస్తోంది భారత ప్రభుత్వం. 

03 May 2023, 8:32 IST

స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా  మొదలయ్యే ఛాన్స్

Stock Markets: భారత స్టాక్ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో ఉంది. 

03 May 2023, 8:15 IST

నేడు ముల్కీలో ప్రధాని మోదీ బహిరంగ సభ

Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు దక్షిణ కన్నడ జిల్లాలోని ముల్కీలో జరిగే బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొననున్నారు. ఈ సభ కోసం బీజేపీ భారీగా ప్లాన్ చేసింది. సుమారు 2.5లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలకు చెందిన 13 నియోజకవర్గాల ప్రజలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది.  

03 May 2023, 8:14 IST

మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో భారీ మార్పు

మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో పెను మార్పు రానుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఎన్‍సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

03 May 2023, 8:15 IST

మూడు రోజులు గోఫస్ట్ విమానాలు బంద్

Go First Airlines: గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానాలు నేటి (మే 3) నుంచి శుక్రవారం వరకు నిలిచిపోనున్నాయి. మూడు రోజుల పాటు అన్ని విమానాలను గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. తీవ్రమైన నిధుల కొరతతో ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రాట్&విట్నీ సంస్థ నుంచి స్పేర్ ఇంజిన్లు రాకపోవటంతో పూర్తిస్థాయిలో విమానాలు నడపే పరిస్థితి లేక.. మూడు రోజుల పాటు పూర్తిగా రద్దు చేసినట్టు వెల్లడించింది.

03 May 2023, 8:15 IST

బంగారం ధరలు స్థిరం

Gold Price Today: దేశీయ మార్కెట్‍లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఉదయం సమయానికి  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,760 వద్ద కొనసాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

    ఆర్టికల్ షేర్ చేయండి