Gold Price Today: బంగారం ధర స్థిరం.. కాస్త పెరిగిన వెండి: నేటి రేట్లు ఇవే-gold price remain stable on 03 april 2023 silver rate hikes check latest prices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: బంగారం ధర స్థిరం.. కాస్త పెరిగిన వెండి: నేటి రేట్లు ఇవే

Gold Price Today: బంగారం ధర స్థిరం.. కాస్త పెరిగిన వెండి: నేటి రేట్లు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
May 03, 2023 05:44 AM IST

Gold Price Today: దేశీయ మార్కెట్‍లో 24 గంటల వ్యవధిలో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. వెండి ధర కాస్త పెరిగింది. వివిధ సిటీల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

నేటి బంగారం ధరల వివరాలు..
నేటి బంగారం ధరల వివరాలు.. (REUTERS)

Gold Price Today: కొంతకాలంగా బంగారం ధరల్లో ఒడిదొడుకులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో దేశీయ మార్కెట్‍లో పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఉదయం నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,700గా ఉంది. కిందటి రోజే ధరే కొనసాగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,760 వద్ద ఉంది. కాగా, దేశీయ మార్కెట్‍లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో…

Gold Rate Today in Hyderabad: హైదరాబాద్‍‍ మార్కెట్‍లో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.55,700 వద్ద కొనసాగింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,760గా ఉంది. ఆంధ్రప్రదేశ్‍లోని అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ప్రధాన సిటీల్లో..

Gold Price Today: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.55,850కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.60,910 వద్ద ఉంది. బెంగళూరు, అహ్మదాబాద్‍ నగరాల్లో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ.55,750 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన తులం పసిడి వెల రూ.60,810 వద్ద కంటిన్యూ అయింది.

Gold Price Today: ముంబై, కోల్‍కతా సిటీల్లో 22 క్యారెట్లకు చెందిన 10 బంగారం వెల రూ.55,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి పసిడి 10 గ్రాముల రేటు రూ.60,760 వద్ద కొనసాగింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.56,150 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.61,250గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‍లో పైకి..

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు మరోసారి 2,000 డాలర్లను అధిగమించింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 2,015 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వడ్డీ రేటుపై యూఎస్ ఫెడ్ చేయనుండటంతో ఆ ప్రభావం బంగారంపై పడింది. అమెరికా బ్యాంకింగ్ రంగంలో అస్థిరత, ద్రవ్యోల్బణం సహా మరిన్ని అంశాలు అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్‍లో గోల్డ్ ధర పెరుగుదల భారత మార్కెట్‍పైనా పడే ఛాన్స్ ఉంది.

స్వల్పంగా పెరిగిన వెండి రేటు

Silver Price Today: దేశంలో నేడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండి (Siver) రేటు రూ.100 పెరిగి రూ.76,100కు చేరింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,500కు వెళ్లింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబై, అహ్మదాబాద్‍లో వెండి కిలో ధర రూ.76,100కు చేరింది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

WhatsApp channel