Maharashtra Politics: “మహారాష్ట్ర రాజకీయాల్లో అతిత్వరలో భారీ మార్పు రాబోతోంది”-big change in maharashtra politics soon bjp leader dilip ghosh after sharad pawar resigns as ncp chief ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Big Change In Maharashtra Politics Soon Bjp Leader Dilip Ghosh After Sharad Pawar Resigns As Ncp Chief

Maharashtra Politics: “మహారాష్ట్ర రాజకీయాల్లో అతిత్వరలో భారీ మార్పు రాబోతోంది”

దిలీప్ ఘోష్
దిలీప్ ఘోష్ (PTI / HT Photo)

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో పెనుమార్పు రాబోతోందని బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ అన్నారు. ఎన్‍సీపీ మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పారు.

Maharashtra Politics: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్ష పదవికి సీనియర్ నేత శరద్ పవార్ (Sharad Pawar) హఠాత్తుగా రాజీనామా చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏదో జరగబోతోందన్న అంచనాలకు తెరతీసింది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రానుందని అన్నారు. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

చర్చలు జరుగుతున్నాయ్

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని చర్చలు జరుగుతున్నాయని దిలీప్ అన్నారు. “కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొని ఉంది. కొన్ని చర్చలు జరుగుతున్నాయి. దీని ప్రతిఫలమే ఇది. ఎన్‍సీపీ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడింది. శరద్ పవార్ తన శక్తిని కోల్పోతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రానుంది” అని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో దిలీప్ ఘోష్ చెప్పారు. ఎన్‍సీపీ కీలకనేత, శరద్ పవార్ అల్లుడు అజిత్ పవార్ బీజేపీలోకి వెళుతున్నారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అయితే, తాను బీజేపీలోకి వెళ్లడం లేదని అజిత్ పవార్ చెప్పారు.

Maharashtra Politics: ఎన్‍సీపీ అధ్యక్ష పదవికి మంగళవారం రోజున శరద్ పవార్ హఠాత్తుగా రాజీనామా చేశారు. ఎవరూ ఊహించని అడుగువేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు అనుకోని మలుపు తిరిగాయి. మంగళవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజీనామా ప్రకటన చేశారు. “చాలా సుదీర్ఘ కాలమైంది. వెనుక ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీని కొత్త తరం ముందుకు నడిపించాల్సిన సమయం వచ్చింది” అని శరద్ పవార్ అన్నారు. “ఇంత సుదీర్ఘ కెరీర్ తర్వాత.. ఏదో ఒక దశలో ఆపేయాలని ఆలోచించాలి కదా” అని ఆయన అన్నారు.

Maharashtra Politics: అయితే, తాను క్రియాశీల రాజకీయాల నుంచి మాత్రం తప్పుకోవడం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. “నేను అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా.. ప్రజాజీవితం నుంచి మాత్రం రిటైర్ అవడం లేదు. బహిరంగ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరవుతా” అని చెప్పారు.

ఎన్‍సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం గురించి పునరాలోచించేందుకు శరద్ పవార్ అంగీకరించారని అజిత్ పవార్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందనేలా సంకేతాలు ఇచ్చారు.

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాలు కొద్దిరోజులుగా మళ్లీ రసవత్తరంగా మారాయి. అజిత్ పవార్ బీజేపీకి వెళుతున్నారన్న ఊహాగానాలు జోరుగా వచ్చాయి. ఎన్‍సీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలను ఆయన తీసుకెళ్లి, పార్టీని చీలుస్తారన్న వాదనలు వినిపించాయి. అదే వీటిని అజిత్ పవార్ ఖండించారు. ఇదే తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజుల్లో కూలిపోబోతోందని శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ అన్నారు.

సంబంధిత కథనం