Sharad Pawar : ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా.. మద్దతుదారుల నిరసన
Sharad Pawar : ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు శరద్ పవార్. మంగళవారం ఉదయం జరిగిన ఓ ఈవెంట్లో తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Sharad Pawar resignation : రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.
మద్దతుదారుల నిరసన..
తన ఆత్మకథకు సంబంధించిన పుస్తకాన్ని మంగళవారం ఉదయం ఆవిష్కరించారు శరద్ యాదవ్. ముంబై వైబీ చవాన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు.
Sharad Pawar latest news : "ఎన్సీపీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఓ సీనియర్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి పార్టీ భవిష్యత్తు కార్యచరణను రూపొందించండి," అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
శరద పవార్ వ్యాఖ్యలు విన్న ఆయన మద్దతుదారులు, పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనేకమంది స్టేజ్‌పైకి వచ్చి.. శరద్ పవార్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. పార్టీ అధినేతగా కొనసాగాలని డిమాండ్ చేశారు. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అన్నారు. లేకపోతే సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించమని తేల్చిచెప్పారు!
Sharad Pawar book : తన బంధువు, ఎన్సీపీలో కీలక నేత అజిత్ పవార్.. బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్న సమయంలో.. పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. రాజీనామా విషయంపై ఎవరితోనూ చర్చించకుండా, శరద్ పవార్ తన నిర్ణయాన్ని ప్రకటించినట్టు ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
శరద్ పవార్.. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి మాత్రమే తప్పుకుంటున్నారని, రాజకీయాల్లో కొనసాగుతారని తెలుస్తోంది. ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడు ఎవరు? అన్న విషయాన్ని ఆయన చెప్పలేదు.
కూతురికి ముందే తెలుసా?
Sharad Pawar steps down as NCP chief : పార్టీలో చర్చించనప్పటికీ.. శరద్ పవార్ రాజీనామా విషయం ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలేకు ఈ విషయం ముందే తెలుసా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘15 రోజుల తర్వాత ఓ పెద్ద విషయం బయటకొస్తుంది,’ అని కొన్ని రోజుల క్రితమే ఆమే వ్యాఖ్యానించడం ఇందుకు కారణం.
రాజకీయాల్లో కీలక పాత్ర..
82ఏళ్ల శరద్ పవార్.. నాలుగుసార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. కేంద్రంలో రక్షణ, వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 మహారాష్ట్ర ఎన్నికల అనంతరం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా కృషిచేశారు శరద్ పవార్. సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్న శివసేనతో ఎన్సీపీ, కాంగ్రెస్ జతకట్టడంలో శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు.
సంబంధిత కథనం