తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Swati Maliwal Dragging Case: స్వాతి మలీవల్ పై వేధింపుల కేసులో ట్విస్ట్

Swati Maliwal dragging case: స్వాతి మలీవల్ పై వేధింపుల కేసులో ట్విస్ట్

HT Telugu Desk HT Telugu

21 January 2023, 14:56 IST

  • Swati Maliwal dragging case: ఢిల్లీ మహిళా కమిషన్ (Delhi Commission for Women) చైర్ పర్సన్ స్వాతి మలీవల్ (Swati Maliwal) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలో మహిళలకు వేధింపులపై రాత్రి సమయంలో ఢిల్లీలో ఇన్ స్పెక్షన్ చేస్తుండగా తనను కార్లో కొంతదూరం లాక్కెళ్లారన్న ఆమె (Swati Maliwal) ఆరోపణలపై బీజేపీ స్పందించింది.

మహిళల భద్రతపై ఢిల్లీలో ఇన్ స్పెక్షన్ చేస్తున్న స్వాతి మలీవల్
మహిళల భద్రతపై ఢిల్లీలో ఇన్ స్పెక్షన్ చేస్తున్న స్వాతి మలీవల్ (Source: Twitter)

మహిళల భద్రతపై ఢిల్లీలో ఇన్ స్పెక్షన్ చేస్తున్న స్వాతి మలీవల్

ఢిల్లీ మహిళా కమిషన్ (Delhi Commission for Women - DCW) చైర్ పర్సన్ స్వాతి మలీవల్ (Swati Maliwal) పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. రాత్రి సమయంలో ఢిల్లీలో మహిళల భద్రతను పరీక్షించడానికి ఎయిమ్స్ ఎదురుగా రోడ్డుపై స్వాతి మలీవల్ (Swati Maliwal) స్టింగ్ ఆపరేషన్ చేశారు. డ్రాప్ చేయమని కోరుతూ కారు పక్కన నిల్చుని ఉన్న తనను ఆ కారు డ్రైవర్ కారుతో పాటు దాదాపు 15 మీటర్ల దూరం లాక్కెళ్లాడు (Swati Maliwal molestation). ఆ సమయంలో తన చేయి ఆ కారు విండోలో ఇరుక్కుపోయి ఉంది. ఆ సమయంలో ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. స్వాతి మలీవల్ (Swati Maliwal) ఫిర్యాదు మేరకు 47 ఏళ్ల హరీశ్ చంద్ర సూర్యవంశీ అనే ఆ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బీజేపీ విమర్శలు

అయితే, స్వాతి మలీవల్ చేసిన ఈ ఆరోపణలను (Swati Maliwal molestation) బీజేపీ ఖండించింది. ఢిల్లీ నగర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆమె ఈ నాటకం ఆడుతున్నారని విమర్శించింది. స్వాతి మలీవల్ చెప్పిన ఆ కారు డ్రైవర్ హరీశ్ చంద్ర సూర్యవంశీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుడని, ఆప్ తో కలిసి స్వాతి మలీవల్ ఆడిన నాటకం ఇదని విమర్శించింది. ఇలాంటి చిల్లర నాటకాల వల్ల ఢిల్లీలో మహిళల భద్రత (Women safety) మెరుగవుతుందా? అని బీజేపీ నేత షాజియా ఇల్మి ప్రశ్నించారు. ఢిల్లీని, ఢిల్లీ పోలీసులను (Delhi police) అప్రతిష్ట పాలు చేయడానికే ఆప్ తో కలిసి స్వాతి మలీవల్ ఈ స్టింగ్ ఆపరేషన్ నాటకం ఆడారని విమర్శించారు. ఇలాంటి నాటకాలతో ఢిల్లీ మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని డీసీడబ్ల్యూ (DCW) మాజీ చైర్ పర్సన్ బర్ఖా శుక్లా వ్యాఖ్యానించారు.

స్వాతి మలీవల్ స్పందన

బీజేపీ (BJP) ఆరోపణలపై డీసీడబ్ల్యూ (Delhi Commission for Women - DCW) చైర్ పర్సన్ స్వాతి మలీవల్ (Swati Maliwal) స్పందించారు. తన గురించి చిల్లర అబద్ధాలు ప్రచారం చేసి తనను భయపెట్టలేరని ఆమె ట్వీట్ చేశారు. ఇలాంటి దాడులు నాపై చాలా జరిగాయి. వాటికి నేను భయపడను. ఇలాంటి దాడి జరిగిన ప్రతీసారి నాలోని కసి మరింత పెరుగుతుంది’ అని ఆ ట్వీట్లో ఆమె పేర్కొన్నారు.