తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kamala Harris: హాలీవుడ్ స్టార్స్ నుంచి కమలా హారిస్ కు పెరుగుతున్న మద్ధతు

Kamala Harris: హాలీవుడ్ స్టార్స్ నుంచి కమలా హారిస్ కు పెరుగుతున్న మద్ధతు

HT Telugu Desk HT Telugu

25 July 2024, 16:36 IST

google News
  • Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా రేసులో ఉన్న భారతీయ మూలాలున్న, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు హాలీవుడ్ స్టార్స్ నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. జార్జ్ క్లూనీ, బియాన్సే, కార్డి బి తదితర స్టార్స్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ కు సపోర్ట్ చేస్తున్నారు.

హాలీవుడ్ స్టార్స్ నుంచి కమలా హారిస్ కు పెరుగుతున్న మద్ధతు
హాలీవుడ్ స్టార్స్ నుంచి కమలా హారిస్ కు పెరుగుతున్న మద్ధతు

హాలీవుడ్ స్టార్స్ నుంచి కమలా హారిస్ కు పెరుగుతున్న మద్ధతు

Kamala Harris: డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి గా బరాక్ ఒబామా తరువాత ఆ స్థాయిలో సెలబ్రిటీల మద్ధతును ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పొందుతున్నారు. ముఖ్యంగా, హాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆమెకు విశేష మద్దతు లభిస్తోంది. అటు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ను, ఇటు డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ను సపోర్ట్ చేయడానికి ఆసక్తి చూపని చాలా మంది ఏ-లిస్ట్ సెలబ్రిటీలు ఇప్పుడు కమలా హారిస్ కు మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నారు. జార్జ్ క్లూనీ, కార్డీ బి, బియాన్సే వంటి స్టార్స్ ఆమె ప్రచారానికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి తోడు బైడెన్ వైదొలగడానికి విముఖత చూపడంతో గతంలో నిధులు అందించడానికి వెనుకాడిన పలువురు ప్రముఖులు కమలా హారిస్ ప్రచారానికి ఫండ్స్ అందించడానికి మళ్లీ ముందుకు వస్తున్నారు.

కమలా హారిస్ కు హాలీవుడ్ మద్దతు

కమలా హారిస్ కు హాలీవుడ్ స్టార్స్ నుంచి మద్దతు భారీగా పెరుగుతోంది. "నా ఫోన్ పేలిపోయేలా ఉంది" అని హారిస్ ప్రచార వ్యవహారాలు చూస్తున్నవారు సీఎన్ఎన్ కు తెలిపారు. కమలా హారిస్ కు మద్దతు తెలపడానికి తనకు ఫోన్ చేస్తున్నవారికి సమాధానం చెప్పడానికి కూడా సమయం లేదని తెలిపారు. హాలీవుడ్లో ప్రతి ఒక్కరూ హారిస్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారని సినిమా, సంగీత ప్రపంచంలోని ఇన్ అండ్ అవుట్స్ తెలిసిన, ఫండ్ రైజింగ్ లో సహాయపడే వ్యక్తుల బృందం తెలిపారు. ‘ప్రస్తుతానికి కమలా హారిస్ మాత్రమే రైట్ చాయిస్ అని వారు భావిస్తున్నారు. లాస్ ఏంజిల్స్ లో కమలా హారిస్ తొలి అధ్యక్ష నిధుల సేకరణకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చేందుకు పలువురు టీవీ, సినీ, సంగీత ఎగ్జిక్యూటివ్ లు ముందుకు వస్తున్నారు’’ అని వారు వెల్లడించారు.

జార్జ్ క్లూనీ సపోర్ట్

అధ్యక్ష అభ్యర్థిగా పోటీ నుంచి వైదొలగమని బైడెన్ (biden) ను బహిరంగంగానే డిమాండ్ చేసిన జార్జ్ క్లూనీ ఇప్పుడు తన మద్ధతును ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు ఇస్తున్నారు. ‘‘అధ్యక్ష రేసు వైదొలగాలని అధ్యక్షుడు తీసుకున్నది సరైన నిర్ణయం. ఆయన మరోసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మద్దతు ఇవ్వడానికి మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం’’ అని క్లూనీ వ్యాఖ్యానించారు.

బియాన్సే సపోర్ట్

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన పాట 'ఫ్రీడమ్'ను కమలా హారిస్ ఉపయోగించేందుకు క్వీన్ బే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. హారిస్ బృందం చివరి నిమిషంలో బియాన్సే టీమ్ నుండి అనుమతి పొందిందని సీఎన్ఎన్ వెల్లడించింది. జో బైడెన్ ఇటీవల పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించిన తర్వాత బియాన్సే అధికారికంగా మద్దతు ఇవ్వనప్పటికీ, 2020 లో బైడెన్-హారిస్ ద్వయానికి మద్దతు ఇచ్చారు.

అరియానా గ్రాండే, కార్డీ బి, క్రిస్టీ బ్రింక్లే

జూలై 22 న అధ్యక్ష పదవి పోటీ నుంచి బైడెన్ వైదొలగి, తన మద్ధతును తన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris) కు ఇచ్చిన కొద్దిసేపటికే, గాయని అరియానా గ్రాండే తన సోషల్ మీడియాలో వారిద్దరి ఫోటోను పోస్ట్ చేసింది. అలాగే, హారిస్ కు మద్దతుగా కార్డీ బీ కూడా నిలిచారు. ‘‘ప్రజల కోసం కమలా హారిస్!! కమలా హారిస్ కోసం మేము ప్రజలం!!’’ అని మోడల్ క్రిస్టీ బ్రింక్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాప్ స్టార్ చార్లీ ఎక్స్ సీఎక్స్ తన ఆల్బమ్ 'బ్రాట్'లోని వ్యక్తిత్వాన్ని పోలిన 'కమలా'ను 'నిజాయితీపరురాలు'గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. మహిళల పునరుత్పత్తి స్వేచ్ఛను పునరుద్ధరించడానికి ఆమె కృషి చేస్తారని, బైడెన్-హారిస్ పరిపాలనలో ప్రారంభించిన విజయాలను కొనసాగిస్తారని చెప్పారు.

కమలా హారిస్ కు జాన్ లెజెండ్ మద్ధతు

అమెరికన్ గాయకుడు జాన్ లెజెండ్ కూడా కమలా హారిస్ కు మద్దతు పలికారు. ‘‘ఆమెను తాను సులభంగా ఓడించగలనని ట్రంప్ (trump) భావిస్తున్నారు. ఆమె ఈ పోరాటానికి సిద్ధంగా ఉంది. నాకు చేతనైనంత సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఆల్ ఆఫ్ మి సింగర్ జాన్ లెజెండ్ తెలిపారు. వీరు కాకుండా, కమలా హారిస్ కు నికోల్ బ్రౌన్, జెస్సికా ఆల్బా, జామీ లీ కర్టిస్, బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, డిస్నీ వారసురాలు అబిగైల్ డిస్నీ, బ్రాడ్లీ విట్ఫోర్డ్, గ్రేస్ అనాటమీ సృష్టికర్త షోండా రైమ్స్.. తదితరులు కూడా తమ మద్దతును ప్రకటించారు.

తదుపరి వ్యాసం