Kamala Harris Diwali celebrations:కమల హ్యారిస్ ఇంట్లో దీపావళి ఉత్సవాలు-kamala harris desi diwali celebrations has bollywood music and sparklers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kamala Harris Diwali Celebrations:కమల హ్యారిస్ ఇంట్లో దీపావళి ఉత్సవాలు

Kamala Harris Diwali celebrations:కమల హ్యారిస్ ఇంట్లో దీపావళి ఉత్సవాలు

HT Telugu Desk HT Telugu
Oct 22, 2022 11:24 PM IST

Kamala Harris Diwali celebrations: అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ శుక్రవారం అమెరికాలోని తన నివాసంలో దీపావళి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.

కమల హ్యారిస్ నివాసంలో దీపావళి సంబురాలు
కమల హ్యారిస్ నివాసంలో దీపావళి సంబురాలు

Kamala Harris Diwali celebrations: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హ్యారిస్ తన అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి ఉత్సవాలు జరుపుకున్నారు. భర్తతో కలిసి మతాబులు వెలిగించారు. ఈ సందర్భంగా కమల హ్యారిస్ ఇంటిని దీపాలతో అలంకరించారు.

Kamala Harris Diwali celebrations: ఇండో అమెరికన్ల హాజరు

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హ్యారిస్ తన నివాసంలో జరిపిన దీపావళి ఉత్సవాలకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్నేహితులు, భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ఆహూతులతో కలిసి మతాబులు కాలుస్తూ, వారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కమల హ్యారిస్ ఉత్సాహంగా కనిపించారు. ఈ దీపావళి ఉత్సవాలకు హాజరైన ఇండో అమెరికన్లలో నీరా టాండన్, వివేక్ మూర్తి, రిచ్ వర్మ, అజయ్ భూటోరియా తదితరులు ఉన్నారు.

Kamala Harris Diwali celebrations: భారతీయ వంటకాలతో విందు..

తన నివాసంలో జరిగిన దీపావళి ఉత్సవాలకు వచ్చిన ఆహూతులకు భారతీయ వంటకాలతో విందును కూడా కమల హ్యారిస్ ఏర్పాటు చేశారు. విందు ఏర్పాట్లను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. కమల హ్యారిస్ తల్లి చెన్నై నుంచి అమెరికా వెళ్లారు. అక్కడే డాక్టరేట్ చేసి అక్కడే సెటిల్ అయ్యారు.

Kamala Harris Diwali celebrations: ఇది అందరి పండుగ

ఈ సందర్భంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హ్యారిస్ మాట్లాడుతూ దీపావళి అందరి పండుగ అన్నారు. ఇది తరతరాలు గా కొనసాగుతున్న సంప్రదాయమని, చెడుపై మంచి సాధించిన గెలుపును ఉత్సవంగా జరుపుకునే సందర్భమని వివరించారు.

IPL_Entry_Point