తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bandhan Bank Interest Rates: బంధన్ బ్యాంక్ సేవింగ్ ఖాతాపై 6.50 శాతం వడ్డీ

Bandhan Bank interest rates: బంధన్ బ్యాంక్ సేవింగ్ ఖాతాపై 6.50 శాతం వడ్డీ

HT Telugu Desk HT Telugu

16 September 2022, 15:33 IST

    • Bandhan Bank interest rates: బంధన్ బ్యాంక్ తన సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచింది.
వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంక్
వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంక్

వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంక్

Bandhan Bank interest rates: బంధన్ బ్యాంక్ తన సేవింగ్ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబరు 16 నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి. దేశీయ, నాన్ రెసిడెంట్ రూపీ సేవింగ్స్ ఖాతాలపై ఇవి వర్తిస్తాయి. తాజా సర్దుబాట్ల అనంతరం ఇప్పుడు ఖాతాదారులు సేవింగ్ ఖాతాలపై 6.50 శాతం వరకు వడ్డీ రేటు పొందుతారు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Bandhan Bank Savings Account Interest Rates: బంధన్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ వడ్డీ రేట్లు ఇలా..

రోజువారీ బ్యాలన్స్ రూ. 1 లక్ష వరకు ఉంటే బ్యాంక్ ఇప్పుడు 3 శాతం వడ్డీ ఇస్తుంది. రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటే 6 శాతం వడ్డీ ఇస్తుంది. రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు రోజువారీ బ్యాలెన్స్ ఉంటే 6.25 శాతం వడ్డీ వర్తిస్తుంది. రూ. కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ఉంటే వడ్డీ రేటు 6.5 శాతం వర్తిస్తుంది.

ఇక రోజువారీ బ్యాలెన్స్ రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంటే వడ్డీ రేటు 6 శాతం వర్తిస్తుంది. రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల మధ్య ఉంటే 6.50 శాతం వడ్డీ వర్తిస్తుంది. రోజులో చివరగా ఉండే బ్యాలెన్స్‌పై వడ్డీ వర్తిస్తుంది. వడ్డీని జూన్ 30, సెప్టెంబరు 30, డిసెంబరు 31, మార్చి 31న చెల్లిస్తారు.

Bandhan Bank Savings Account Interest Rates

ద్రవ్యోల్భణం అదుపులో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. వచ్చే వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి 75 నుంచి 100 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాబోయే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి క్రమంగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు ఆధారంగా తమ తమ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.