తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Big Asteroid Heading Towards Earth| భూమి వైపు దూసుకువస్తున్న భారీ ఆస్టరాయిడ్

Big Asteroid heading towards Earth| భూమి వైపు దూసుకువస్తున్న భారీ ఆస్టరాయిడ్

HT Telugu Desk HT Telugu

15 September 2022, 22:26 IST

  • Big Asteroid heading towards Earth| ఈ వారం భూమిని పలకరించనున్న మరో అతిథి అంతరిక్షం నుంచి వస్తోంది. భారీ గ్రహ శకలం ఒకటి సెప్టెంబర్ 18 న భూమికి అతి దగ్గరగా రానుంది. ఈ అతిధి గతంలోనూ భూమిని పలకరించింది. 2005లో భూమికి దగ్గరగా వచ్చిన ఈ ఆస్టరాయిడ్.. మళ్లీ 2036లో భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంది.

గ్రహ శకలం 2005 RX3
గ్రహ శకలం 2005 RX3

గ్రహ శకలం 2005 RX3

Big Asteroid heading towards Earth| సౌర వ్యవస్థలో గ్రహ శకలాలు కూడా తమ నిర్ధారిత కక్షల్లో తిరుగుతుంటాయి. అలాంటి ఒక గ్రహ శకలమే 2005 RX3. దీన్ని మొదట 2005లో గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ దాదాపు వృత్తాకార కక్షలో తిరుగుతుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

Big Asteroid heading towards Earth| స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్నా పెద్దది

ఈ గ్రహ శకలం మన గుజరాత్ లో ఏర్పాటు చేసిన, ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్నా పొడవైనది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 192 మీటర్ల ఎత్తు ఉంటే, ఈ ఆస్టారాయిడ్ పొడవు దాదాపు 210 మీటర్లు. ప్రస్తుతం ఇది భూమి, సూర్యుడి మధ్య ఉన్న దూరం కన్నా 1.3 రెట్లు ఎక్కువ దూరంలో ఉందని నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (Joint Propulsion Laboratory JPL)) వెల్లడించింది. ప్రస్తుతం ఈ గ్రహ శకలం గంటకు 62,820 కిమీల వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది. ఇదే వేగంతో సెప్టెంబర్ 18న ఇది భూమికి అత్యంత సమీపంలో నుంచి దూసుకువెళ్తుంది. అత్యంత సమీపం అంటే కూడా దాదాపు 47 లక్షల కిమీల దూరం నుంచి అన్నమాట. కాస్మిక్ దూరాల విషయంలో దీన్ని సమీపంగానే పరిగణిస్తారు.

Big Asteroid heading towards Earth| మరో నాలుగు కూడా..

ఈ 2005 RX3 గ్రహ శకలంతో పాటు మరో నాలుగు ఆస్టరాయిడ్లు కూడా ఈ వారం భూమికి సమీపంగా రానున్నాయి. అవి 2020 PT4, 2022 QD1, 2022 QB37, 2022 QJ50. వీటిలో 2020 PT4 గంటకు 39 వేల కిమీల వేగంతో భూమి వైపు వస్తోంది. ఇది భూమి నుంచి సుమారు 71 లక్షల కిమీల దూరం నుంచి దూసుకువెళ్తుంది. అలాగే, 2022 QD1. ఇది గంటకు 34 వేల కిమీల వేగంతో భూమి వైపు వస్తోంది. సెప్టెంబర్ 16 న భూమిని దాటి వెళ్తుంది. గ్రహ శకలం 2022 QB37 కూడా సెప్టెంబర్ 18న భూమికి సమీపంగా వస్తుంది. 2022 QJ50 గంటకు 33 వేల కిమీల వేగంతో భూమి వైపు వస్తోంది. ఇది ఈ వారాంతంలో భూమికి సమీపంగా వస్తుంది.